Telugu Global
Cinema & Entertainment

బాహుబలి పై పూర్తి క్లారిటి ఇచ్చిన రాజమౌళి

అన్నీ చెప్పినట్టే ఒక్కొక్కటిగా పూర్తిచేస్తున్నాడు రాజమౌళి. వచ్చే నెల నుంచి బాహుబలి-2 సినిమాను పట్టాలపైకి తీసుకురాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి 3 విషయాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. వాటిలో ఒకటి స్క్రీన్ ప్లే. బాహుబలి-2 సినిమాకు సంబంధించి టోటల్ స్క్రీన్ ప్లేను పూర్తిచేశాడు జక్కన్న. తండ్రి విజయేంద్రప్రసాద్ సహకారంతో స్క్రీన్ ప్లే మొత్తం పూర్తిచేసినట్టు ప్రకటించాడు. ఇక సినిమాకు సంబంధించి మరో చేరిక జరిగింది. బాహుబలి-2 కోసం లావణ్య త్రిపాఠీని హీరోయిన్ గా తీసుకున్నారు. […]

బాహుబలి పై పూర్తి క్లారిటి ఇచ్చిన రాజమౌళి
X
అన్నీ చెప్పినట్టే ఒక్కొక్కటిగా పూర్తిచేస్తున్నాడు రాజమౌళి. వచ్చే నెల నుంచి బాహుబలి-2 సినిమాను పట్టాలపైకి తీసుకురాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి 3 విషయాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. వాటిలో ఒకటి స్క్రీన్ ప్లే. బాహుబలి-2 సినిమాకు సంబంధించి టోటల్ స్క్రీన్ ప్లేను పూర్తిచేశాడు జక్కన్న. తండ్రి విజయేంద్రప్రసాద్ సహకారంతో స్క్రీన్ ప్లే మొత్తం పూర్తిచేసినట్టు ప్రకటించాడు. ఇక సినిమాకు సంబంధించి మరో చేరిక జరిగింది. బాహుబలి-2 కోసం లావణ్య త్రిపాఠీని హీరోయిన్ గా తీసుకున్నారు. సినిమాలో ఆమెను తీసుకున్న విషయం నిజమే అయినప్పటికీ, ఆమె పాత్ర ఏంటనే విషయాన్ని మాత్రం జక్కన్న కన్ ఫర్మ్ చేయలేదు. ఇక ముచ్చటగా మూడో క్లారిటీ కూడా ఇచ్చాడు. తమ సినిమాలో మాధురీ దీక్షిత్ నటిస్తుందనే విషయాన్ని ఖండించాడు రాజమౌళి. బాహుబలి-2లో మాధురీ దీక్షిత్ నటించట్లేదని క్లారిటీ ఇచ్చాడు.ఇలా ఒక్కొక్క విషయాన్ని క్లియర్ చేస్తూ సినిమా సెట్స్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు జక్కన్న.
First Published:  4 Nov 2015 7:04 PM GMT
Next Story