Telugu Global
Cinema & Entertainment

త్వరలో బాలనటిగా మహేష్ కూతురు సితార

ప్రస్తుతం బ్రహ్మోత్సవం అనే సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాలో ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ ఎట్రాక్షన్ కు తోడు బ్రహ్మోత్సవానికి ఇప్పుుడు మరో ఎట్రాక్షన్ తోడైంది. ఈ సినిమాతో మహేష్ కూతురు సితార బాలనటిగా పరిచయం కాబోతోందనేది లేటెస్ట్ న్యూస్. అవును.. సినిమాలోని ఓ చిన్న బాలనటి పాత్రకు మహేష్ కూతురు సితారను తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ ప్రతిపాదనను మహేష్ ముందుంచాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. మహేష్ ఇంకా ఆలోచనలో […]

త్వరలో బాలనటిగా మహేష్ కూతురు సితార
X
ప్రస్తుతం బ్రహ్మోత్సవం అనే సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాలో ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ ఎట్రాక్షన్ కు తోడు బ్రహ్మోత్సవానికి ఇప్పుుడు మరో ఎట్రాక్షన్ తోడైంది. ఈ సినిమాతో మహేష్ కూతురు సితార బాలనటిగా పరిచయం కాబోతోందనేది లేటెస్ట్ న్యూస్. అవును.. సినిమాలోని ఓ చిన్న బాలనటి పాత్రకు మహేష్ కూతురు సితారను తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ ప్రతిపాదనను మహేష్ ముందుంచాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. మహేష్ ఇంకా ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటివరకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రిన్స్ కొడుకు గౌతమ్ ఇప్పటికే వెండితెరపైకొచ్చాడు. వన్-నేనొక్కిడినే సినిమాలో ఓ కీలకపాత్ర పోషించాడు. చిన్నప్పటి మహేష్ గా నటించాడు. ఇప్పుడు కూతురు సితార కూడా తెరపైకొస్తే.. ఇద్దరు బాలనటుల ఎంట్రీ దిగ్విజయంగా పూర్తయినట్టే.
First Published:  4 Nov 2015 7:02 PM GMT
Next Story