Telugu Global
Cinema & Entertainment

త్రిపుర పై అంచ‌నాలు పెరిగాయి

ఏ సినిమాకైన రిలీజ్ కు ముందు  ఇండ‌స్ట్రీ నుంచి పాజిటివ్ టాక్  వినిపిస్తే..  క‌చ్చితంగా  హిట్ అయిన‌ట్లే.గ‌తంలో  చాల సినిమాల విష‌యంలొ  ఇది జ‌రిగింది.తాజాగా    డైరెక్ట‌ర్ రాజ్ కిర‌ణ్   చేసిన  త్రిపుర చిత్రం పై అవే త‌ర‌హా అంచ‌నాలు పెరిగాయి.   స్వాతి, న‌వీన్ చంద్ర లీడ్ రోల్స్ లో  వ‌స్తున్న ఈ చిత్రం లో  స్వాతి ఒక గ్రామీణ యువ‌తిగా  న‌టిస్తుంది.  న‌వీన్ చంద్ర డాక్ట‌ర్ రోల్ చేస్తున్నారు.   క‌థ ప‌రంగా  స్వాతి  కి   ప్ర‌తి రోజు […]

త్రిపుర పై అంచ‌నాలు పెరిగాయి
X

ఏ సినిమాకైన రిలీజ్ కు ముందు ఇండ‌స్ట్రీ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తే.. క‌చ్చితంగా హిట్ అయిన‌ట్లే.గ‌తంలో చాల సినిమాల విష‌యంలొ ఇది జ‌రిగింది.తాజాగా డైరెక్ట‌ర్ రాజ్ కిర‌ణ్ చేసిన త్రిపుర చిత్రం పై అవే త‌ర‌హా అంచ‌నాలు పెరిగాయి. స్వాతి, న‌వీన్ చంద్ర లీడ్ రోల్స్ లో వ‌స్తున్న ఈ చిత్రం లో స్వాతి ఒక గ్రామీణ యువ‌తిగా న‌టిస్తుంది. న‌వీన్ చంద్ర డాక్ట‌ర్ రోల్ చేస్తున్నారు.

క‌థ ప‌రంగా స్వాతి కి ప్ర‌తి రోజు రాత్రి నిద్ర‌లో క‌ల‌లు బాగా వ‌స్తుంటాయి. మ‌రి పెళ్లి అయిన త‌రువాత ఆ అల‌వాటు ఏమైంది. ఎటువంటి ప‌రిస్థితులు ఎదురయ్యాయి. అనేది సినిమా క‌థ‌గా తెలుస్తుంది. ఈ సినిమాకు క‌మ్రాన్ సంగీతం అందించారు. గీతాంజ‌లి సినిమాకు సంగీతం అందించిన ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు శిష్యుడే క‌మ్రాన్. ఈ చిత్రంలో స్వాతి న‌ట‌న సినిమాకు ప్రాణం అంటున్నారు ర‌చ‌యిత‌లు కోన వెంక‌ట్, వ‌లిగొండ శ్రీ‌నివాస్. ఒక్క నైజామ్ ఏరియాలోనే త్రిపుర చిత్రం 3 వంద‌ల థియేట‌ర్స్ లో రిలీజ్ అవుతుంది అంటే అర్ధం చేసుకోవ‌చ్చు ఈ సినిమాకు ఏ రేంజ్ హైప్ వ‌చ్చిందో…!

First Published:  4 Nov 2015 7:03 PM GMT
Next Story