Telugu Global
Cinema & Entertainment

డిక్టేటర్ రాక షురూ అయింది

ఓవైపు ఎన్టీఆర్ నటిస్తున్న నాన్నకు ప్రేమతో సినిమా విడుదలపై అనుమానాలు పెరిగిపోతున్న నేపథ్యలో.. మరోసారి తన సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చాడు బాలయ్య. తన 99వ సినిమా డిక్టేటర్ సంక్రాంతికే వస్తుందని పక్కా చేశాడు. సినిమా అనుకున్నట్టు జనవరి 14నే థియేటర్లలోకి వస్తుందంటున్నారు. డిసెంబర్ లో ఆడియో విడుదల చేసి, సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ మరోసారి స్పష్టంచేశారు. నిజానికి ఈనెలాఖరుకే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని, డిసెంబర్ ఫస్ట్ వీక్ కే […]

డిక్టేటర్ రాక షురూ అయింది
X
ఓవైపు ఎన్టీఆర్ నటిస్తున్న నాన్నకు ప్రేమతో సినిమా విడుదలపై అనుమానాలు పెరిగిపోతున్న నేపథ్యలో.. మరోసారి తన సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చాడు బాలయ్య. తన 99వ సినిమా డిక్టేటర్ సంక్రాంతికే వస్తుందని పక్కా చేశాడు. సినిమా అనుకున్నట్టు జనవరి 14నే థియేటర్లలోకి వస్తుందంటున్నారు. డిసెంబర్ లో ఆడియో విడుదల చేసి, సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ మరోసారి స్పష్టంచేశారు. నిజానికి ఈనెలాఖరుకే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని, డిసెంబర్ ఫస్ట్ వీక్ కే ఫస్ట్ కాపీ సిద్ధమైపోతుందని ప్రకటించారు మేకర్స్. తాజా పరిణామాల బట్టి చూస్తుంటే.. డిక్టేటర్ సినిమా సంక్రాంతికి రావడం ఖాయమని తెలుస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
First Published:  4 Nov 2015 7:06 PM GMT
Next Story