Telugu Global
Cinema & Entertainment

నాగ్, వెంకీ కోసం నితిన్ రెడీ

త్వరలోనే మజ్ను అనే ఓ కొత్త ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురానున్నాడు అక్కినేని హీరో నాగచైతన్య. మలయాళంలో హిట్టయిన ప్రేమమ్ అనే సినిమాకు రీమేక్ గా ఇది రానుంది.ఈ సినిమాలో నాగార్జున, వెంకటేష్ కూడా రెండు కీలకపాత్రలు పోషించనున్నారు. వీళ్లిద్దర్నీ స్వయంగా నాగచైతన్య ఒప్పించాడు. సినిమా ఈనెల 30న ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉండగా నాగార్జున, వెంకటేష్ కు ప్రత్యామ్నాయం కూడా సిద్ధంచేశారు మేకర్స్. ఒకవేళ నాగ్, వెంకీలో ఎవరైనా డ్రాప్ అయితే.. ఆ స్థానాన్ని నితిన్ […]

నాగ్, వెంకీ కోసం నితిన్ రెడీ
X
త్వరలోనే మజ్ను అనే ఓ కొత్త ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురానున్నాడు అక్కినేని హీరో నాగచైతన్య. మలయాళంలో హిట్టయిన ప్రేమమ్ అనే సినిమాకు రీమేక్ గా ఇది రానుంది.ఈ సినిమాలో నాగార్జున, వెంకటేష్ కూడా రెండు కీలకపాత్రలు పోషించనున్నారు. వీళ్లిద్దర్నీ స్వయంగా నాగచైతన్య ఒప్పించాడు. సినిమా ఈనెల 30న ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉండగా నాగార్జున, వెంకటేష్ కు ప్రత్యామ్నాయం కూడా సిద్ధంచేశారు మేకర్స్. ఒకవేళ నాగ్, వెంకీలో ఎవరైనా డ్రాప్ అయితే.. ఆ స్థానాన్ని నితిన్ తో రీప్లేస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నితిన్ కు స్టోరీ వినిపించి, అతడి అంగీకారం కూడా తీసుకున్నారు. సినిమాకు చాలా కీలకమైన పాత్ర కావడంతోపాటు, స్టార్ ఎట్రాక్షన్ కూడా అవసరమయ్యే క్యారెక్టర్ కావడంతో నితిన్ కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈనెల 30న తెలుస్తాయి. మొత్తమ్మీద. నాగచైతన్య చేయేబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ దాదాపు మల్టీస్టారర్ గా రానుందన్నమాట.
First Published:  3 Nov 2015 7:12 PM GMT
Next Story