Telugu Global
Cinema & Entertainment

శీను వైట్ల‌.. కోన‌ల  బంధం  కోమా లో ఉందా..?

దేనికైన  ఎక్స్ పైరీ డేట్ వుంటుంది.  అలాగే  కొన్ని రిలేష‌న్స్ కికూడా  ఎండ్ వుంటుందంటారు  ర‌చ‌యిత కోన వెంక‌ట్. ఇక   ఇండ‌స్ట్రీలో .. కోన వెంక‌ట్, శీను వైట్ల  , గోపి మోహ‌న్ ల త్ర‌యం ఎంత బ‌ల‌మైన‌దో తెలిసిందే.  వెంకీ చిత్రంతో    ప్రారంభ‌మైన  వీరి  స్నేహా బంధం.. బాద్ షా చిత్రం వ‌ర‌కు  సాగింది.  కానీ..   ఆ త‌రువాత  వీరి మధ్య ప్రొఫెష‌న‌ల్  గ్యాప్ వ‌చ్చింది.   కోన వెంకట్ మాత్రం […]

శీను వైట్ల‌.. కోన‌ల  బంధం  కోమా లో ఉందా..?
X
దేనికైన ఎక్స్ పైరీ డేట్ వుంటుంది. అలాగే కొన్ని రిలేష‌న్స్ కికూడా ఎండ్ వుంటుందంటారు ర‌చ‌యిత కోన వెంక‌ట్. ఇక ఇండ‌స్ట్రీలో .. కోన వెంక‌ట్, శీను వైట్ల , గోపి మోహ‌న్ ల త్ర‌యం ఎంత బ‌ల‌మైన‌దో తెలిసిందే. వెంకీ చిత్రంతో ప్రారంభ‌మైన వీరి స్నేహా బంధం.. బాద్ షా చిత్రం వ‌ర‌కు సాగింది. కానీ.. ఆ త‌రువాత వీరి మధ్య ప్రొఫెష‌న‌ల్ గ్యాప్ వ‌చ్చింది. కోన వెంకట్ మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చి..ఆయ‌న స్టైల్లో ఆయ‌న సినిమాలు చేసుకుంటున్నారు.
అయితే ఈ మ‌ధ్య రాంచ‌ర‌ణ్ సినిమా కోసం.. శీను వైట్ల‌.. కోన వెంక‌ట్ క‌ల‌సి వ‌ర్క్ చేశారు. ఈ క‌ల‌యిక తాత్క‌లిక‌మే అని కోన వెంకట్ ఒక ఇంట‌ర్వూలో ఇండైరెక్ట్ గా అన్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ కు మెయిన్ రీజ‌న్ ఏమిటి అని అడిగితే.. సినిమా క్రెడిట్ అనేది ద‌ర్శ‌కుడు ఒక్క‌డే తీసుకోవ‌డం అనేది చాలా దారుణం అంటారు కోన వెంక‌ట్. ఎవ‌రి క్రెడిట్స్ వాళ్ల‌కు ఇస్తే.. అది రైట్ అప్రొచ్ అంటారు. అయితే ద‌ర్శ‌కుడు శీను వైట్లకు అటువంటి టీమ్ స్పిరిట్ లేదంటూ ఆరోపించారు. ఆయ‌న మీద త‌న మేజ‌ర్ కంప్లైంట్ అదే అంటారు. ఫైన‌ల్ గా ..శీను వైట్ల‌.. మీ మ‌ధ్య రిలేష‌న్ ఎలా ఉంది అని అడిగిన ప్ర‌శ్న‌కు .. అది కోమా లో ఉంది. ఏదైనా జ‌ర‌గొచ్చు అంటూ ముగింపు ఇచ్చారు.
First Published:  3 Nov 2015 7:12 PM GMT
Next Story