వరంగల్ ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థి
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితిపై పోటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నడుం బిగిస్తోంది. ఇక్కడ ఇప్పటివరకు ప్రధానంగా మూడు పక్షాల మధ్యే పోటీ ఉంటుందని భావించారు. కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బరిలోకి నిలవడంతో ప్రధాన పోటీ చతుర్ముఖంగా తయారైంది. వైఎస్ఆర్సీ పార్టీ నుంచి జిల్లా పార్టీ చెందిన ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్‌ను బరిలో నిలుపుతున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. టీఆర్ఎస్తో తమ పార్టీ కుమ్మక్కయ్యిందని వస్తున్న ఆరోపణలు […]
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితిపై పోటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నడుం బిగిస్తోంది. ఇక్కడ ఇప్పటివరకు ప్రధానంగా మూడు పక్షాల మధ్యే పోటీ ఉంటుందని భావించారు. కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బరిలోకి నిలవడంతో ప్రధాన పోటీ చతుర్ముఖంగా తయారైంది. వైఎస్ఆర్సీ పార్టీ నుంచి జిల్లా పార్టీ చెందిన ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్‌ను బరిలో నిలుపుతున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. టీఆర్ఎస్తో తమ పార్టీ కుమ్మక్కయ్యిందని వస్తున్న ఆరోపణలు నిజం కాదని నిరూపించడానికే తాము సూర్యప్రకాష్‌ను బరిలోకి దింపుతున్నట్టు పొంగులేటి తెలిపారు. వైసీపీ పోటీ చేస్తుంటే టిడిపి-బీజేపీ కూటమి, కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు భయమని, కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారన్న వార్తలు అవాస్తవమని పొంగులేటి స్ఫష్టం చేశారు. టిడిపి నేతలే కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారని, వరంగల్ బరిలో తమ పోటీ ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థిపైనే ఉంటుందని ఆయన తెలిపారు.