Telugu Global
Cinema & Entertainment

శంకరాభరణంకు లైన్ క్లియర్ అయింది

నిఖిల్-నందిత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా శంకరాభరణం. హీరోయిన్ అంజలి ఓ కీలక పాత్ర పోషించింది. ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 4న శంకరాభరణం వస్తున్నట్టు ప్రకటించారు. ఫైనల్ రిలీజ్ డేట్ అని ఎందుకన్నామంటే.. ప్రతి వారం ఈ సినిమా వస్తుందని చెప్పడం విడుదల పోస్ట్ పోన్ కావడం కామన్ అయిపోయింది. ఈనెల 20న వస్తుందన్నారు.. తర్వాత 27 అన్నారు.. ఇప్పుడు డిసెంబర్ 4 పక్కా […]

శంకరాభరణంకు లైన్ క్లియర్ అయింది
X
నిఖిల్-నందిత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా శంకరాభరణం. హీరోయిన్ అంజలి ఓ కీలక పాత్ర పోషించింది. ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 4న శంకరాభరణం వస్తున్నట్టు ప్రకటించారు. ఫైనల్ రిలీజ్ డేట్ అని ఎందుకన్నామంటే.. ప్రతి వారం ఈ సినిమా వస్తుందని చెప్పడం విడుదల పోస్ట్ పోన్ కావడం కామన్ అయిపోయింది. ఈనెల 20న వస్తుందన్నారు.. తర్వాత 27 అన్నారు.. ఇప్పుడు డిసెంబర్ 4 పక్కా అంటున్నారు. బహుశా ఆ తేదీకి శంకరాభరణం విడుదలైపోవచ్చు. ఎందుకంటే.. డిసెంబర్ 4న బాక్సాఫీస్ వద్ద పెద్దగా కాంపిటిషన్ లేదు. నవంబర్ నెలాఖరున విడుదలవుతున్న బెంగాల్ టైగర్ హవా కూడా డిసెంబర్ 4కు కాస్త తగ్గొచ్చు. ఆ నమ్మకంతోనే శంకరాభరణం రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఆమధ్య హిందీలో వచ్చిన ఫస్ గయారే ఒబామా అనే సినిమా నుంచి ప్రేరణ పొంది ఈ శంకరాభరణంను తెరకెక్కించారు. కోనవెంకట్ ఈ సినిమాకు కథను అందించడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా సమకూర్చి పెట్టాడు.
First Published:  2 Nov 2015 7:03 PM GMT
Next Story