Telugu Global
Cinema & Entertainment

స్నేహమంటే ఇదేరా...

దోస్త్‌ మేరా దోస్త్‌… అంటూ బాలీవుడ్‌ అగ్ర కథానాయకులైన షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ పాడుకున్నారు. మరోసారి తమ స్నేహాన్ని చాటుకున్నారు. షారుక్‌ యాభయేళ్లు నిండిన సందర్భంగా సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. అయితే సల్మాన్‌ తన ఇంటికి వచ్చి శుభాకాంక్షలు చెప్పటంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. “సుల్తాన్‌” అనే చిత్రంలో మల్లయోధుడిగా నటిస్తున్న సల్మాన్‌ భయ్‌ అదే వేషధారణలోనే కింగ్‌ ఖాన్‌ ఇంటికి వెళ్లి విష్‌ చేయడంతో పాటు ఇద్దరూ కామెడీగా ఓ రెండు నిమిషాలు ఫైట్‌ చేసుకున్నారు. తమ “ఫన్‌ […]

స్నేహమంటే ఇదేరా...
X

దోస్త్‌ మేరా దోస్త్‌… అంటూ బాలీవుడ్‌ అగ్ర కథానాయకులైన షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ పాడుకున్నారు. మరోసారి తమ స్నేహాన్ని చాటుకున్నారు. షారుక్‌ యాభయేళ్లు నిండిన సందర్భంగా సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. అయితే సల్మాన్‌ తన ఇంటికి వచ్చి శుభాకాంక్షలు చెప్పటంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. “సుల్తాన్‌” అనే చిత్రంలో మల్లయోధుడిగా నటిస్తున్న సల్మాన్‌ భయ్‌ అదే వేషధారణలోనే కింగ్‌ ఖాన్‌ ఇంటికి వెళ్లి విష్‌ చేయడంతో పాటు ఇద్దరూ కామెడీగా ఓ రెండు నిమిషాలు ఫైట్‌ చేసుకున్నారు. తమ “ఫన్‌ ఫైట్‌” ఫోటోను షారుక్‌ ట్విట్టర్‌లో పెట్టి తెగ సంబరపడ్డాడు. బాలీవుడ్‌ అభిమానులు మాత్రం ఆహా… భలే మంచి రోజు అని ఈ ఖాన్‌ ముచ్చటపడ్డారు.

సల్మాన్‌-కత్రినా డీప్‌లవ్‌లో ఉన్నప్పుడు ఓ పార్టీలో కత్రినాపై షారుక్‌ నోరు పారేసుకోవటంతో షారుక్‌-సల్మాన్‌ శతృవులయ్యారు. తమ మధ్య పచ్చగడ్డి వేస్తే కూడా భగ్గుమనే పీక్‌ స్టేజ్‌కు వెళ్లారు. అయితే సల్మాన్‌ ఖాన్‌ తన చెల్లెలు అర్పితాఖాన్‌ పెళ్లికి ఇన్వైట్‌ చేశాడు. దీంతో అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే అర్పితా పెళ్లికి వెళ్లి తెగ హడావిడి చేసి సల్మాన్‌ భయ్‌కు చాలా దగ్గరయ్యాడు షారుక్‌. మొత్తానికి సల్మాన్‌-షారుక్‌ ఇద్దరూ భేషజాలకు పోకుండా క్లోజ్‌గా ఉండి ఇండస్ట్రీకే సరికొత్త వెలుగు తెస్తున్నారు. దీంతో బాలీవుడ్‌ జనాలు హ్యాపీగా ఉన్నారు.

Next Story