Telugu Global
Cinema & Entertainment

అందుకే సైజ్ జీరో లో నాగార్జున సీన్స్ తీసేశారు

ఏ భాషలో క్రేజ్ ఉంటే ఆ భాషకు సంబంధించిన హీరోనే పెడతారు. మొహమాటానికి మరో హీరోతో చేయరు. నాగార్జున విషయంలో కూడా అదే జరిగింది. తమిళ వెర్షన్ కోసం ఏకంగా నాగార్జునను పక్కనపెట్టేశారు. సైజ్ జీరోకు సంబంధించిన మేటర్ ఇది. అనుష్క లీడ్ రోల్ లో, ఆర్య హీరోగా తెరకెక్కుతోంది సైజ్ జీరో.  ఈ సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. సైజ్ జీరోలో నాగార్జున ఓ గెస్ట్ రోల్ లో కనిపించాడనే విషయం అందరికీ […]

అందుకే సైజ్ జీరో లో నాగార్జున సీన్స్ తీసేశారు
X

ఏ భాషలో క్రేజ్ ఉంటే ఆ భాషకు సంబంధించిన హీరోనే పెడతారు. మొహమాటానికి మరో హీరోతో చేయరు. నాగార్జున విషయంలో కూడా అదే జరిగింది. తమిళ వెర్షన్ కోసం ఏకంగా నాగార్జునను పక్కనపెట్టేశారు. సైజ్ జీరోకు సంబంధించిన మేటర్ ఇది. అనుష్క లీడ్ రోల్ లో, ఆర్య హీరోగా తెరకెక్కుతోంది సైజ్ జీరో. ఈ సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. సైజ్ జీరోలో నాగార్జున ఓ గెస్ట్ రోల్ లో కనిపించాడనే విషయం అందరికీ తెలిసిందే. సినిమాకు ప్రమోషన్ రావడానికి అది కూడా ఓ కారణమే. అయితే తమిళ వెర్షన్ లో మాత్రం నాగార్జునను పక్కనపెట్టేశారు. అక్కడున్న డిమాండ్ ప్రకారం.. నాగార్జున కంటే జీవా అయితే బెటరని భావించారు మేకర్స్. అందుకే నాగ్ చేసిన గెస్ట్ రోల్ ను జీవాతో చేయిస్తున్నారు. అలా తమిళ వెర్షన్ లో లేకుండా పోయాడు నాగార్జున. అయితే ఈ విషయాలన్నీ నాగార్జునకు ముందుగానే చెప్పామంటున్నారు మేకర్స్. ప్రస్తుతం తమకు, నాగ్ కు మధ్య ఎలాంటి బేధాబ్రిప్రాయాలు లేవంటున్నారు.

First Published:  2 Nov 2015 7:07 PM GMT
Next Story