Telugu Global
Cinema & Entertainment

షారుక్ పుట్టిన రోజు ఇలా వేసేశాడు

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈసారి తన పుట్టినరోజు వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నారు. 50వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ సూపర్ స్టార్ తన కుటుంబసభ్యుల నడుమ అర్ధరాత్రి దాటాక కేక్ కట్ చేశారు. భార్య గౌరీఖాన్, పిల్లలు ఆర్యన్, సుహానా, ఆబ్‌రామ్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా ఆయన నివాసం మన్నత్ వద్ద ఆదివారం రాత్రి పెద్దసంఖ్యలో అభిమానులు గుమిగూడారు. తనపై అంతులేని అభిమానాన్ని, ప్రేమను ప్రకటిస్తున్న అభిమానులకు, కుటుంబసభ్యులకు షారుఖ్ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు […]

షారుక్ పుట్టిన రోజు ఇలా వేసేశాడు
X
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈసారి తన పుట్టినరోజు వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నారు. 50వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ సూపర్ స్టార్ తన కుటుంబసభ్యుల నడుమ అర్ధరాత్రి దాటాక కేక్ కట్ చేశారు. భార్య గౌరీఖాన్, పిల్లలు ఆర్యన్, సుహానా, ఆబ్‌రామ్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా ఆయన నివాసం మన్నత్ వద్ద ఆదివారం రాత్రి పెద్దసంఖ్యలో అభిమానులు గుమిగూడారు. తనపై అంతులేని అభిమానాన్ని, ప్రేమను ప్రకటిస్తున్న అభిమానులకు, కుటుంబసభ్యులకు షారుఖ్ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.
‘హ్యాపీ బర్త్ డే షారుఖ్.. ఇంట్లోనే అర్ధరాత్రి వేడుకలు నిర్వహించాం’ అంటూ గౌరీఖాన్.. షారుఖ్ కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సాధారణంగా షారుఖ్ తన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి ఆయన పూర్తిగా కుటుంబసభ్యుల మధ్యే ఆనందంగా గడిపారు. ‘నా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. జీవించడం ఇంత అందంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు’ అని షారుఖ్ ట్వీట్ చేశారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘దిల్‌వాలే’ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే షారుఖ్ ‘ఫ్యాన్’ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది.
Next Story