Telugu Global
Cinema & Entertainment

సల్మాన్‌ను కొరికిన గుర్రం

ఊహించని విధంగా సల్మాన్ కు గాయమైంది. కానీ ఆ విషయం చూసినవాళ్లెవరికీ తెలీదు. అలా మేనేజ్ చేస్తున్నాడు కండల వీరుడు. ప్రస్తుతం ప్రేమ్ రతన్ ధన్ పాయో అనే సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు సల్మాన్. ఈ నెల్లోనే ఇది థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ తో పాటు కొత్త సినిమా షూటింగ్ కూడా ప్రారంభించాడు. సుల్తాన్ అనే సినిమా పిక్చరైజేష్ లో పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి గుర్రపు […]

సల్మాన్‌ను కొరికిన గుర్రం
X

ఊహించని విధంగా సల్మాన్ కు గాయమైంది. కానీ ఆ విషయం చూసినవాళ్లెవరికీ తెలీదు. అలా మేనేజ్ చేస్తున్నాడు కండల వీరుడు. ప్రస్తుతం ప్రేమ్ రతన్ ధన్ పాయో అనే సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు సల్మాన్. ఈ నెల్లోనే ఇది థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ తో పాటు కొత్త సినిమా షూటింగ్ కూడా ప్రారంభించాడు. సుల్తాన్ అనే సినిమా పిక్చరైజేష్ లో పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి గుర్రపు స్వారీ చేయాల్సి ఉంది. ఆ ప్రాక్టీస్ లో ఉంటుండగానే గుర్రం సల్మాన్ భుజం కింది భాగంలో కొరికేసింది. వెంటనే సల్మాన్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రాధమిక చికిత్స పూర్తిచేశారు. గాయం కాస్త చిన్నదే అవ్వడంతో, అటు షూటింగ్, ఇటు ప్రమోషన్ ను ఆపలేదు సల్మాన్. దెబ్బ కనిపించకుండా మేనేజ్ చేస్తూ.. కొత్త సినిమా ప్రమోషన్ లో పాల్గొంటున్నాడు. షూటింగ్ కు మాత్రం జస్ట్ 2 రోజులు గ్యాప్ ఇచ్చాడంతే.

First Published:  1 Nov 2015 1:03 PM GMT
Next Story