Telugu Global
Cinema & Entertainment

అఖిల్ కు లైన్ క్లియర్ చేసిన బెంగాల్ టైగర్

దీపావళి కానుకగా బెంగాల్ టైగర్ సినిమాను విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఇప్పటికే ఒకసారి వాయిదాపడిన అఖిల్ సినిమాకు పోటీగా నిలవడం ఇష్టంలేక ఆ సినిమాను వాయిదా వేశారు. ఒక దశలో దీపావళికే సినిమాను తీసుకొద్దామని రవితేజ పట్టుబట్టినట్టు సమాచారం. కానీ నాగార్జున సీన్ లోకి ఎంటరై, రవితేజతో మాట్లాడి సినిమాను వాయిదావేయించినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు బెంగాల్ టైగర్ సినిమాకు సంబంధించి విడుదల తేదీని ప్రకటించకపోవడానికి ఇదే కారణం. నాగార్జున బుజ్జగించడంతో, బెంగాల్ టైగర్ యూనిట్ రిలీజ్ డేట్ […]

అఖిల్ కు లైన్ క్లియర్ చేసిన బెంగాల్ టైగర్
X
దీపావళి కానుకగా బెంగాల్ టైగర్ సినిమాను విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఇప్పటికే ఒకసారి వాయిదాపడిన అఖిల్ సినిమాకు పోటీగా నిలవడం ఇష్టంలేక ఆ సినిమాను వాయిదా వేశారు. ఒక దశలో దీపావళికే సినిమాను తీసుకొద్దామని రవితేజ పట్టుబట్టినట్టు సమాచారం. కానీ నాగార్జున సీన్ లోకి ఎంటరై, రవితేజతో మాట్లాడి సినిమాను వాయిదావేయించినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు బెంగాల్ టైగర్ సినిమాకు సంబంధించి విడుదల తేదీని ప్రకటించకపోవడానికి ఇదే కారణం. నాగార్జున బుజ్జగించడంతో, బెంగాల్ టైగర్ యూనిట్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది.తమ సినిమాను నవంబర్ 27న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు స్పష్టంచేసింది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న బెంగాల్ టైగర్ లో రవితేజ సరసన తమన్న, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ స్వరపరిచిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో, విడుదలైన ట్రయిలర్ సూపర్ హిట్టవ్వడంతో బెంగాల్ టైగర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Next Story