Telugu Global
Cinema & Entertainment

లోఫర్ ను చుట్టేశారా.. ముగించారా..?

పూరి జగన్నాద్ దర్శకత్వంలో వరుణ్ తేజ చేస్తున్న సినిమా లోఫర్. కెరీర్ లో వరుణ్ తేజకు ఇది వరుసగా మూడో సినిమా. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు తాజాగా ప్రకటించాడు వరుణ్. సినిమాను వీలైనంత తొందరగా థియేటర్లలోకి తీసుకొస్తామంటున్నాడు. వరుణ్ తేజ తాజాగా నటించిన కంచె సినిమాకు థియేటర్లలో మంచి స్పందన వస్తోంది. పెద్దగా సినిమాల్లేకపోవడం, కంచె సినిమా కాస్తోకూస్తో ఆకట్టుకోవడంతో వరుణ్ కు బాగానే మార్కులు పడ్డాయి. దీంతో ఈ క్రేజ్ ను ఇలానే […]

లోఫర్ ను చుట్టేశారా.. ముగించారా..?
X
పూరి జగన్నాద్ దర్శకత్వంలో వరుణ్ తేజ చేస్తున్న సినిమా లోఫర్. కెరీర్ లో వరుణ్ తేజకు ఇది వరుసగా మూడో సినిమా. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు తాజాగా ప్రకటించాడు వరుణ్. సినిమాను వీలైనంత తొందరగా థియేటర్లలోకి తీసుకొస్తామంటున్నాడు. వరుణ్ తేజ తాజాగా నటించిన కంచె సినిమాకు థియేటర్లలో మంచి స్పందన వస్తోంది. పెద్దగా సినిమాల్లేకపోవడం, కంచె సినిమా కాస్తోకూస్తో ఆకట్టుకోవడంతో వరుణ్ కు బాగానే మార్కులు పడ్డాయి. దీంతో ఈ క్రేజ్ ను ఇలానే కొనసాగించాలనే ఉద్దేశంతో.. లోఫర్ సినిమాను తొందరగా పూర్తిచేశారు. కుదిరితే నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ లోనే థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. కావాలనే లోఫర్ సినిమాను తొందరగా చుట్టేశారనే వార్తలు వస్తున్నాయి. కంచె క్రేజ్ లో లోఫర్ ను వీలైనంత తొందరగా థియేటర్లలోకి తీసుకురావాలనే తొందరలో సినిమాను ముగించేశారనే పుకార్లు వ్యాపిస్తున్నాయి. మరోవైపు సినిమకు లోఫర్ అనే పేరు మార్చి, మరో పేరు పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారు.
Next Story