Telugu Global
Cinema & Entertainment

క్లారిటీ ఇచ్చారు.. అనుమానాలు పెంచారు

బెంగాల్ టైగర్ సినిమాకు సంబంధించి ఈ మధ్యంతా ఓ పుకారు షికారు చేసింది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రవితేజకు నచ్చలేదని, అందుకే హుటాహుటిన మళ్లీ రీషూట్లు చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని సినిమా యూనిట్ తిప్పికొట్టింది. తమ సినిమాకు సంబంధించి ఎలాంటి రీషూట్లు చేయడం లేదని ప్రకటించింది బెంగాల్ టైగర్ యూనిట్. సినిమాను సంపత్ నంది చక్కగా తెరకెక్కించాడని మెచ్చుకుంది. అవుట్ పుట్ అద్భుతంగా ఉందంటూ ప్రెస్ […]

క్లారిటీ ఇచ్చారు.. అనుమానాలు పెంచారు
X
బెంగాల్ టైగర్ సినిమాకు సంబంధించి ఈ మధ్యంతా ఓ పుకారు షికారు చేసింది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రవితేజకు నచ్చలేదని, అందుకే హుటాహుటిన మళ్లీ రీషూట్లు చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని సినిమా యూనిట్ తిప్పికొట్టింది. తమ సినిమాకు సంబంధించి ఎలాంటి రీషూట్లు చేయడం లేదని ప్రకటించింది బెంగాల్ టైగర్ యూనిట్. సినిమాను సంపత్ నంది చక్కగా తెరకెక్కించాడని మెచ్చుకుంది. అవుట్ పుట్ అద్భుతంగా ఉందంటూ ప్రెస్ నోట్ కూడావిడుదల చేసింది. అంతా చేసిన బెంగాల్ టైగర్ టీం, ఓ పుకారుపై క్లారిటీ ఇస్తూనే.. సినిమాపై మరిన్ని అనుమానాల్ని రేకెత్తించింది. రీషూట్లు చేయడం లేదని ప్రకటించిన యూనిట్, సినిమా విడుదల ఎప్పుడనే అంశాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. దీపావళి కానుకగా సినిమా వస్తుందని అంతా భావిస్తున్న టైమ్ లో, విడుదల తేదీని ప్రకటించకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది.
Next Story