Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్‌కి స్టార్ రైటర్ చురక

అది కాన్‌ఫిడెన్సో ఓవర్ కాన్‌ఫిడెన్సో ఎవరికీ అర్థం కావట్లేదు స్టార్ రైటర్ కోన వెంకట్ ప్రస్తుత వ్యాఖ్యలు వింటుంటే. మా సినిమా ‘శంకరాభరణం’ కి ఏ పండుగ సీజన్ అవసరం లేదు. మా సినిమా రిలీజ్ అయినప్పుడే ఒక పండుగ అని తన సినిమా ఆడియో ఫంక్షన్ లో కోన వెంకట్ అనడం చూస్తుంటే అదేదో ఎవరినో వెక్కిరించినట్లుంది. ఇటీవల దసరా సీజన్‌లో ఒకానొక సిట్యువేషన్‌లో ‘బ్రూస్ లీ’, ‘రుద్రమ దేవి’ మరియు ‘అఖిల్’ పోటీలో ఉన్నప్పుడు.. […]

రామ్ చరణ్‌కి స్టార్ రైటర్ చురక
X

అది కాన్‌ఫిడెన్సో ఓవర్ కాన్‌ఫిడెన్సో ఎవరికీ అర్థం కావట్లేదు స్టార్ రైటర్ కోన వెంకట్ ప్రస్తుత వ్యాఖ్యలు వింటుంటే. మా సినిమా ‘శంకరాభరణం’ కి ఏ పండుగ సీజన్ అవసరం లేదు. మా సినిమా రిలీజ్ అయినప్పుడే ఒక పండుగ అని తన సినిమా ఆడియో ఫంక్షన్ లో కోన వెంకట్ అనడం చూస్తుంటే అదేదో ఎవరినో వెక్కిరించినట్లుంది. ఇటీవల దసరా సీజన్‌లో ఒకానొక సిట్యువేషన్‌లో ‘బ్రూస్ లీ’, ‘రుద్రమ దేవి’ మరియు ‘అఖిల్’ పోటీలో ఉన్నప్పుడు.. ‘రామ్ చరణ్ తన సినిమా ‘రుద్రమ దేవి’ కోసం వెనుకకు తగ్గేది లేదని.. మా సినిమాకి కూడా, మా నిర్మాతకు కూడా పైసలు రావాలి కదా .. అని పండుగ సీజన్ కు కర్చీఫ్ వేసాడు. అఫ్‌కోర్స్ అనుకోకుండా ‘అఖిల్’ సైడ్ అయిపోవడం వలన కొద్దిగా సైలెంట్ అయినా, అనుకున్నట్లు గానే దసరాకి రిలీజ్ చేసారు ‘బ్రూస్ లీ’ ని. విషయం లేకపోవడం వలన పండుగ సీజన్ సెలవులు అయినా.. రామ్ చరణ్ సినిమా ఆడలేదు. అలా పండుగ సీజన్ కోసం కొట్లాడకుండా.. దీపావళిని కూడా ‘అఖిల్’ కోసం వదిలేసారట కోన వెంకట్ అక్కినేని నటదీపం కోసం. స్టార్ హీరోల స్టార్ కిడ్స్ పండుగ సీజన్ కోసం కొట్లాడుకుంటుంటే.. కోన మాత్రం తన సినిమా నాన్-ఫెస్టివల్ సీజన్ అయిన డిసెంబర్ రెండవ వారంలో రిలీజ్‌కు ప్లాన్ వేసాడు. మరి వేసిన చురకలు ఎవరికో ఈపాటికే అర్థం అయినట్లే కదా!

First Published:  31 Oct 2015 7:02 PM GMT
Next Story