Telugu Global
Cinema & Entertainment

మరోసారి మెగా టార్గెట్

మెగా కాంపౌండ్ ను టార్గెట్ చేస్తూ దాసరి నారాయణరావు మరోసారి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. త్రిపుర సినిమా ఆడియో ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన దాసరి, మెగాకాంపౌండ్ పై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు.. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ పై దర్శక రత్న విరుచుకుపడ్డారు. త్రిపుర ఆడియో వేడుకలో మాట్లాడిన దాసరి, మరిన్ని చిన్న చిత్రాలు రావాలన్నారు. అయితే పెద్ద ఫ్యామిలీస్ నుంచి ఏకంగా 10మంది హీరోలున్న ఈ తరుణంలో చిన్న సినిమాలకు, చిన్న […]

మరోసారి మెగా టార్గెట్
X
మెగా కాంపౌండ్ ను టార్గెట్ చేస్తూ దాసరి నారాయణరావు మరోసారి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. త్రిపుర సినిమా ఆడియో ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన దాసరి, మెగాకాంపౌండ్ పై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు.. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ పై దర్శక రత్న విరుచుకుపడ్డారు. త్రిపుర ఆడియో వేడుకలో మాట్లాడిన దాసరి, మరిన్ని చిన్న చిత్రాలు రావాలన్నారు. అయితే పెద్ద ఫ్యామిలీస్ నుంచి ఏకంగా 10మంది హీరోలున్న ఈ తరుణంలో చిన్న సినిమాలకు, చిన్న హీరోలకు కష్టాలు తప్పవన్నారు. అయితే, పండగ టైమ్ లో కూడా చిన్న సినిమాలు విడుదలైనప్పుడే లాభాలు బాగా వస్తాయన్నారు దాసరి. దసరా సందర్భంగా విడుదలైన చిన్న చిత్రాలన్నీ మంచి వసూళ్లు సాధించాయని గుర్తుచేశారు. మరోవైపు రేసులో ఓ బడా సినిమా ఉన్నప్పటికీ, అది ఫ్లాప్ అవ్వడంతో చిన్న సినిమాలకు బాగా కలిసొచ్చిందని కామెంట్స్ చేశారు. పరోక్షంగా బ్రూస్ లీ సినిమాను ఉద్దేశించే దాసరి ఈ వ్యాఖ్యలు చేశారని అంతా చెవులు కొరుక్కున్నారు.
Next Story