Telugu Global
NEWS

వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్య

కాంగ్రెస్‌ పట్ల తనకున్న విధేయత వల్లే హైకమాండ్ తనకు టికెట్ ఇచ్చిందని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా స్థానిక నాయకుల అభిప్రాయాలు, స్థానికత ఆధారంగా వరంగల్‌ లోక్‌సభ ఉపఎన్నికకు రాజయ్య పేరును కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే కాంగ్రెస్‌కు లాభిస్తుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, ఈ అంశం ఎన్నికల్లో కలిసి వస్తుందన్నారు. గతంలో వరంగల్‌లో చేసిన అభివృద్ధే తన […]

వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్య
X

కాంగ్రెస్‌ పట్ల తనకున్న విధేయత వల్లే హైకమాండ్ తనకు టికెట్ ఇచ్చిందని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా స్థానిక నాయకుల అభిప్రాయాలు, స్థానికత ఆధారంగా వరంగల్‌ లోక్‌సభ ఉపఎన్నికకు రాజయ్య పేరును కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే కాంగ్రెస్‌కు లాభిస్తుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, ఈ అంశం ఎన్నికల్లో కలిసి వస్తుందన్నారు. గతంలో వరంగల్‌లో చేసిన అభివృద్ధే తన ప్రచారాస్త్రమన్నారు. సిరిసిల్ల రాజయ్య 2009 ఎన్నికల్లో వరంగల్‌ నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయారు. గ్రూప్‌ వన్‌ ఆఫీసర్ అయిన సిరిసిల్ల రాజయ్య 2009 ఎన్నికలకు ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు.
రాజయ్యకు అన్నివిధాలా అండగా ఉంటా: వివేక్‌
వరంగల్‌ నియోజకవర్గం పార్లమెంట్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ రాజయ్యను ఎంపిక చేయడాన్ని మాజీ ఎంపీ వివేక్‌ స్వాగతించారు. కాంగ్రెస్‌ అధిష్టానం తనను పోటీ చేయమని కోరినప్పటికీ తనకు పెద్దపల్లి నియోజకవర్గంతో ఉన్న అనుబంధం కారణంగానే వరంగల్ ఉప ఎన్నిక బరిలో దిగలేకపోయానని ఆయన అన్నారు. వరంగల్ నుంచి తనను పోటీ చేయాలన్న కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ టికెట్ లభించిన రాజయ్యకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని వివేక్ తెలిపారు. కాగా వివేక్ ను బరిలోకి దించేందుకు అధిష్టానం ప్రతినిధిగా దిగ్విజయ్‌సింగ్‌ చేసిన ప్రయత్నం ఫలించలేదు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు కూడా ఎంతగా ప్రయత్నించినా ఆయన మాత్రం ససేమిరా అన్నారు. వరంగల్‌ నుంచి పోటీకి మొదటి నుంచి ఆయన సుముఖంగా లేరు. దీంతో రాజయ్యకు లైన్ క్లియర్ అయి టికెట్‌ దక్కింది.

First Published:  31 Oct 2015 10:35 AM GMT
Next Story