Telugu Global
Cinema & Entertainment

అనుమానాలు మరింత పెంచిన కోన

బ్రూస్ లీని సినిమాకు సంబంధించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ప్రకటించాడు రచయిత కోన వెంకట్. తమ సినిమా ప్రస్తుతం బ్రహ్మాండంగా ఆడుతోందని, ఇంకా వసూళ్లు వస్తున్నాయని, అనుమానాలు అక్కర్లేదని అంటున్నాడు. అయితే కోన ఇంత సడెన్ గా బ్రూస్ లీ సినిమాను భుజానికెత్తుకోవడం చాలామందికి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇన్నాళ్లూ ఈ సినిమా విషయంలో సైలెంట్ గా ఉన్న కోన, ఇప్పుడు ఒకేసారి బ్రూస్ పై మాట్లాడ్డం సంచలనమైంది. మరీ ముఖ్యంగా అనుమానాలు అక్కర్లేదంటూ కోన ఏ […]

అనుమానాలు మరింత పెంచిన కోన
X
బ్రూస్ లీని సినిమాకు సంబంధించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ప్రకటించాడు రచయిత కోన వెంకట్. తమ సినిమా ప్రస్తుతం బ్రహ్మాండంగా ఆడుతోందని, ఇంకా వసూళ్లు వస్తున్నాయని, అనుమానాలు అక్కర్లేదని అంటున్నాడు. అయితే కోన ఇంత సడెన్ గా బ్రూస్ లీ సినిమాను భుజానికెత్తుకోవడం చాలామందికి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇన్నాళ్లూ ఈ సినిమా విషయంలో సైలెంట్ గా ఉన్న కోన, ఇప్పుడు ఒకేసారి బ్రూస్ పై మాట్లాడ్డం సంచలనమైంది. మరీ ముఖ్యంగా అనుమానాలు అక్కర్లేదంటూ కోన ఏ విషయాన్ని ఉద్దేశించి అన్నాడో స్పష్టంగా చెప్పలేదు.
బ్రూస్ లీ సినిమా నష్టాల్లో నడుస్తోందని, తమను ఆదుకోవాలని కొందరు డిస్ట్రిబ్యూటర్లు సినిమా పెద్దల్ని ఆశ్రయించారట. మరోవైపు దర్శకుడు శ్రీనువైట్లపై 10కోట్ల రూపాయలకు పరువునష్టం కేసు ఒకటి పడిందట. ఇలా రెండు పుకార్లు నడుస్తున్నాయి బ్రూస్ లీ సినిమాపై. ఈ రెండింటిలో ఏ అంశానికి సంబందించి కోన రియాక్ట్ అయ్యాడనేది ఎవరికీ అర్థం కాలేదు.
Next Story