Telugu Global
Cinema & Entertainment

పాక్ చిత్రానికి క‌రీనా ప‌చ్చ‌జెండా

బాలీవుడ్ ముద్దుగుమ్మ క‌రీనా క‌పూర్‌ పాకిస్తాన్ సినిమాలో న‌టించేందుకు ఓకే చెప్పింద‌ట‌. ఈ చిత్రానికి ప్ర‌ముఖ పాకిస్తాన్‌ ద‌ర్శ‌కుడు షోయ‌బ్ మ‌న్సూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. చిత్ర క‌థ వినేందుకు ద‌ర్శ‌కుడి ఆహ్వానం మేర‌కు దుబాయ్ వెళ్లేందుకు క‌రీనా సిద్ధ‌మ‌వుతోంద‌ట‌.  ద‌ర్శ‌కుడు షోయ‌బ్ చిత్రాల‌కు పాకిస్తాన్‌లో చ‌క్క‌టి ఆద‌ర‌ణ ఉంది. అత‌ను ఈ క‌థ‌ను ప్ర‌త్యేకంగా క‌రీనాను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేసుకున్న‌ట్లు తెలిసింది. పాకిస్తాన్ నుంచి బాలీవుడ్‌లోకి హీరోయిన్లు, సంగీత ద‌ర్శ‌కులు, గాయ‌కులు రావ‌డం మ‌నం చూస్తూనే […]

పాక్ చిత్రానికి క‌రీనా ప‌చ్చ‌జెండా
X
బాలీవుడ్ ముద్దుగుమ్మ క‌రీనా క‌పూర్‌ పాకిస్తాన్ సినిమాలో న‌టించేందుకు ఓకే చెప్పింద‌ట‌. ఈ చిత్రానికి ప్ర‌ముఖ పాకిస్తాన్‌ ద‌ర్శ‌కుడు షోయ‌బ్ మ‌న్సూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. చిత్ర క‌థ వినేందుకు ద‌ర్శ‌కుడి ఆహ్వానం మేర‌కు దుబాయ్ వెళ్లేందుకు క‌రీనా సిద్ధ‌మ‌వుతోంద‌ట‌. ద‌ర్శ‌కుడు షోయ‌బ్ చిత్రాల‌కు పాకిస్తాన్‌లో చ‌క్క‌టి ఆద‌ర‌ణ ఉంది. అత‌ను ఈ క‌థ‌ను ప్ర‌త్యేకంగా క‌రీనాను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేసుకున్న‌ట్లు తెలిసింది. పాకిస్తాన్ నుంచి బాలీవుడ్‌లోకి హీరోయిన్లు, సంగీత ద‌ర్శ‌కులు, గాయ‌కులు రావ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే పాకిస్తాన్ సినిమాలో న‌టించిన తొలి హీరోయిన్ క‌రీనా క‌పూర్ స‌రికొత్త రికార్డు సృష్టించ‌నుంది. ఈ ప‌రిణామాన్ని బాలీవుడ్ ప్ర‌ముఖులు ఆహ్వానిస్తున్నారు. ఈ త‌ర‌హా చిత్రాలు రూపొందితే.. ఇరుదేశాల మ‌ధ్య మంచి మార్కెట్‌ను సృష్టించిన వారిమ‌వుతామ‌ని, ఉభ‌య‌దేశాల సంబంధాలు కూడా పెరుగుతాయ‌ని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భ‌జ్‌రంగీ భాయ్‌జాన్ సినిమానే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఉద‌హ‌రిస్తున్నారు.
Next Story