Telugu Global
Cinema & Entertainment

ఆ విష‌యంలో త‌ట్టుకోలేని క‌ళ్యాణ్ రామ్‌

కొందిరికి అభిమానుల్ని చూస్తే  త‌మ‌ను తాము కంట్రోల్ చేసుకోలేరు.  మెయిన్ టాపిక్ ను వ‌దిలేసి.. పెద్ద గా  సంబంధం లేని  విష‌యంలో  ఎమోష‌న‌ల్ అవుతుంటారు.  ఈ మ‌ధ్య నంద‌మూరి యువ హీరోలు ఎన్టీఆర్,  క‌ళ్యాణ్ రామ్..వారికి  చిత్రాల‌కు సంబంధించిన ఆడియో  వేడుక‌ల్లో  ఏదో ఒక విష‌యం మీద ఎమోష‌న‌ల్  అవుతుంటారు. టెంప‌ర్ రిలీజ్ స‌మ‌యంలో యంగ్ టైగ‌ర్ అభిమానుల కోసం  ఎన్ని ఫెయిల్యూర్స్ అయిన  ..మ‌ళ్లీ మ‌ళ్లీ  చిత్రాలు చేస్తూనే వుంటాను.. వారి క‌ళ్ల‌లో ఆనంద‌మే నా […]

ఆ విష‌యంలో త‌ట్టుకోలేని క‌ళ్యాణ్ రామ్‌
X

కొందిరికి అభిమానుల్ని చూస్తే త‌మ‌ను తాము కంట్రోల్ చేసుకోలేరు. మెయిన్ టాపిక్ ను వ‌దిలేసి.. పెద్ద గా సంబంధం లేని విష‌యంలో ఎమోష‌న‌ల్ అవుతుంటారు. ఈ మ‌ధ్య నంద‌మూరి యువ హీరోలు ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్..వారికి చిత్రాల‌కు సంబంధించిన ఆడియో వేడుక‌ల్లో ఏదో ఒక విష‌యం మీద ఎమోష‌న‌ల్ అవుతుంటారు. టెంప‌ర్ రిలీజ్ స‌మ‌యంలో యంగ్ టైగ‌ర్ అభిమానుల కోసం ఎన్ని ఫెయిల్యూర్స్ అయిన ..మ‌ళ్లీ మ‌ళ్లీ చిత్రాలు చేస్తూనే వుంటాను.. వారి క‌ళ్ల‌లో ఆనంద‌మే నా ఆనందం అన్నంతంగా ఎమోష‌న‌ల్ అయ్యారు.
ఇక తాజాగా షేర్ సినిమా ఆడియో రిలీజ్ లో క‌ళ్యాణ్ రామ్ ‘మేమందరం ఒకే రక్తం పంచుకుని పుట్టిన వాళ్లం. ఫ్యామిలీ గురించి మాట్లాడితే నేను ఎమోషనల్ అయిపోతా. జనాలు నా సినిమాల గురించి మాట్లాడొచ్చు. నా నటనను విమర్శించవచ్చు. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి. నేను వాటిని గౌరవిస్తాను. కానీ నా క్యారెక్టర్ గురించి, నా ఫ్యామిలీ గురించి కామెంట్లు చేస్తే మాత్రం తట్టుకోలేను. ఫ్యామిలీ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. మా కుటుంబానికి ఉన్న గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలనుకుంటాను. ఆడియో ఫంక్షన్లో ఎమోషన్ గా మాట్లాడాల్సి వచ్చింది. నా ఫ్యామిలీకి నేనిచ్చే ఇంపార్టెన్స్ అది’’ అని కళ్యాణ్ రామ్ అన్నాడు.
తన తమ్ముడు ఎన్టీఆర్‌ తనకు వ్యక్తిగతంగా, సినిమాల పరంగా ఎంతో సపోర్టివ్‌గా ఉంటున్నాడని.. తమ్ముడితో తాను నిర్మించబోయే సినిమా వచ్చే ఏడాది ఉంటుందని.. ఐతే తమ ఫ్యామిలీ హీరోలు కలిసి నటించే సినిమా గురించి ఇంకా ఆలోచించలేదని కళ్యాణ్ రామ్ చెప్పాడు.

Next Story