Telugu Global
International

ఆఫ్రికా దేశాల అబివృద్ధికి చేయూత: మోదీ భరోసా

ఒకప్పుడు ధాస్య శృంఖలాల మధ్య బతికిన భారత్‌, ఆఫ్రికాలు ఈరోజు తలెత్తుకుని మనుగడ సాగిస్తున్నాయని, అభివృద్ది పథంలో ఇవి మరింత ముందుకెళ్ళాలని భారత ప్రధాని నరేంద్రమోది పిలుపు ఇచ్చారు. తాము వేగంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేస్తున్నామని, ఆఫ్రికా అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం గౌరవంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఆఫ్రికా దేశాల అభివృద్ధికి మరింత సాయం అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఇండో-ఆఫ్రికన్ ముగింపు కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో […]

ఆఫ్రికా దేశాల అబివృద్ధికి చేయూత: మోదీ భరోసా
X

ఒకప్పుడు ధాస్య శృంఖలాల మధ్య బతికిన భారత్‌, ఆఫ్రికాలు ఈరోజు తలెత్తుకుని మనుగడ సాగిస్తున్నాయని, అభివృద్ది పథంలో ఇవి మరింత ముందుకెళ్ళాలని భారత ప్రధాని నరేంద్రమోది పిలుపు ఇచ్చారు. తాము వేగంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేస్తున్నామని, ఆఫ్రికా అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం గౌరవంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఆఫ్రికా దేశాల అభివృద్ధికి మరింత సాయం అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఇండో-ఆఫ్రికన్ ముగింపు కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో 54 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఇది కేవలం భారత్‌-ఆఫ్రికా సదస్సు మాత్రమే కాదు… మూడింట ఒక వంతు ప్రజల కలలకు సంబంధించినదని తెలిపారు.
భారత్‌లో 1.25 మిలియన్ల జనాభా ఉందని, అలాగే ఆఫ్రికా దేశాల్లో 1.25 మిలియన్ల జనాభా ఉందని, ఈ రెండు దేశాలను కాదని ప్రపంచం ముందుకెళ్లలేదని ప్రధాని మోది అన్నారు. ప్రగతి పథంలో పయనించడానికి యువత ముందుండాలని, మూడేళ్లలో 25 వేల మంది ఆఫ్రికా దేశాల యువతకు భారత్‌లో శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఆఫ్రికా క్రీడలు, కళలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయని మోదీ పేర్కొన్నాయి. భారత్‌, ఆఫ్రికాలో మూడింట రెండో వంతు 35 ఏళ్ల లోపు వారే ఉన్నారన్నారు. ఐరాస, భద్రతా మండలిలో సంస్కరణల కోసం భారత్‌, ఆఫ్రికా దేశాలు ఐక్యంగా పోరాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.

First Published:  29 Oct 2015 1:31 AM GMT
Next Story