Telugu Global
Cinema & Entertainment

వెంక‌న్న సేవ‌లో  హాట్ హీరోయిన్

బాలీవుడ్   హాట్ బ్యూటీ  దీపిక ప‌దుకోణ్ కు   సినిమాల అంటే ఎంతో ప్రేమో.. అలాగే తిరుప‌తి వెంక‌న్న కూడా అంతే అనుకుంటా.   త‌రుచుగా  ఈ హాట్ బ్యూటీ వెంక‌న్న ద‌ర్శ‌నం చేసుకోవ‌డం  మ‌న‌కు తెలిసిన విష‌యమే. తాజాగా గురువారం  దీపిక  తిరుప‌తి వెంక‌న్న ను ద‌ర్శించుకుంది. న‌టిగా  స‌క్సెస్ లిస్ట్ లో అగ్ర‌స్థానంలో వున్న  దీపిక ఆ మ‌ధ్య  ఓవ‌ర్ స్ట్రెస్ ఎదుర్కొన  విష‌యం తెలిసిందే.  అయితే  ఓప‌న్ గా మీడియాకు తెలియ […]

వెంక‌న్న సేవ‌లో  హాట్ హీరోయిన్
X
బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక ప‌దుకోణ్ కు సినిమాల అంటే ఎంతో ప్రేమో.. అలాగే తిరుప‌తి వెంక‌న్న కూడా అంతే అనుకుంటా. త‌రుచుగా ఈ హాట్ బ్యూటీ వెంక‌న్న ద‌ర్శ‌నం చేసుకోవ‌డం మ‌న‌కు తెలిసిన విష‌యమే. తాజాగా గురువారం దీపిక తిరుప‌తి వెంక‌న్న ను ద‌ర్శించుకుంది. న‌టిగా స‌క్సెస్ లిస్ట్ లో అగ్ర‌స్థానంలో వున్న దీపిక ఆ మ‌ధ్య ఓవ‌ర్ స్ట్రెస్ ఎదుర్కొన విష‌యం తెలిసిందే. అయితే ఓప‌న్ గా మీడియాకు తెలియ చేసి.. బ‌య‌ట‌కు క‌నిపించేదంతా హ్యాపి కాద‌ని ఇండ‌స్ట్రీలో స్టార్ డ‌మ్ వెన‌క ఎంత ఒత్తిడి వుంటుందో దీపిక చెప్ప‌క‌నే చెప్పారు.
తాజాగా సంజ‌య్ లీలా బ‌న్సాలీ డైరెక్ష‌న్ లో బాజీరావు మ‌స్తానీ చిత్రం చేస్తున్నారు . త‌న క్లోజ్ ఫ్రెండ్ ర‌ణ్వీర్ సింగ్ లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో త‌న కథ పరంగా బాజీరావు ప్రేయ‌సీ రోల్ చేస్తుంది. ఈ సినిమా డిసెంబ‌ర్ 18న రిలీజ్ చేయ‌డానికి డేట్ పిక్స్ చేశారు. ఇదే రోజున దీపిక ల‌క్కీ హీరో షారుక్ ఖాన్, కాజోల్ న‌టించిన సినిమా రిలీజ్ అవుతుంది. సో ..అటు దీపిక‌..అటు షారుక్ .. ఎవ‌రి చిత్రం ఘ‌న విజ‌యం సాధిస్తుందో అనే ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
Next Story