Telugu Global
Cinema & Entertainment

తమన్నపై మనసు పారేసుకున్న బెల్లంకొండ

బెల్లంకొండ సురేష్, తన కొడుకును హీరోగా పెట్టి అల్లుడు శ్రీను సినిమా చేశాడు. అందులో తమన్నాతో ఐటెంసాంగ్ పెట్టాడు. అప్పటివరకు ఐటెంసాంగ్స్ చేయని మిల్కీబ్యూటీ, బెల్లంకొండ ఆఫర్ చేసిన ఎమౌంట్ ను కాదనలేక ఐటెంసాంగ్ చేసింది. అప్పట్లో కేవలం ఆ స్పెషల్ సాంగ్ కోసమే తమన్నా 2 కోట్ల రూపాయలు తీసుకుందని టాక్. తర్వాత సినిమా కూడా బాగా ఆడింది. ఆ సెంటిమెంట్ తో బెల్లంకొండ ఇప్పుడు మరోసారి తమన్నాను ఐటెంభామగా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం […]

తమన్నపై మనసు పారేసుకున్న బెల్లంకొండ
X
బెల్లంకొండ సురేష్, తన కొడుకును హీరోగా పెట్టి అల్లుడు శ్రీను సినిమా చేశాడు. అందులో తమన్నాతో ఐటెంసాంగ్ పెట్టాడు. అప్పటివరకు ఐటెంసాంగ్స్ చేయని మిల్కీబ్యూటీ, బెల్లంకొండ ఆఫర్ చేసిన ఎమౌంట్ ను కాదనలేక ఐటెంసాంగ్ చేసింది. అప్పట్లో కేవలం ఆ స్పెషల్ సాంగ్ కోసమే తమన్నా 2 కోట్ల రూపాయలు తీసుకుందని టాక్. తర్వాత సినిమా కూడా బాగా ఆడింది. ఆ సెంటిమెంట్ తో బెల్లంకొండ ఇప్పుడు మరోసారి తమన్నాను ఐటెంభామగా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ కొడుకు శ్రీనివాస్. ఓ తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా మిల్కీబ్యూటీతో ఐటెంసాంగ్ ప్లాన్ చేశారు. ఈసారి కూడా తమన్న బిజీ. బాహుబలి, బెంగాల్ టైగర్ సినిమాతో పాటు మరో తమిళ సినిమాతో బిజీగా ఉంది. అయినప్పటికీ.. ఈసారి కూడా బెల్లంకొండ బ్లాక్ చెక్ ఆఫర్ ఇవ్వడంతో ఐటెంసాంగ్ చేసేందుకు ఒప్పుకుంది తమన్న.
Next Story