Telugu Global
Cinema & Entertainment

స్వ‌యంగా ర‌జ‌నీకాంతే ఫోన్ చేశారు

రెండు  బిగ్ డిజాస్ట‌ర్స్ తో  త‌న అభిమానుల్ని డిజ‌పాయింట్ చేసిన  ర‌జనీకాంత్..లేటెస్ట్ గా కొత్త ద‌ర్శకుడు రంజిత్ తో   క‌బాలీ చిత్రం చేస్తున్న  విష‌యం తెలిసిందే.  అయితే ఈ సినిమాలో  హీరోయిన్స్  విష‌యంలో   అనేక గాసిప్స్‌ విపిస్తున్నాయి.  సినిమా ప్రారంభంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న బాలీవుడ్ కు చెందిన అనేక మంది ముద్దుగుమ్ముల పేర్లు వినిపించాయి. అయితే చివ‌ర‌కు రాధిక ఆప్టేను ఎంపిక చేశారు.  ఇక తాజా స‌మాచారం ఏమిటంటే.. ఈ చిత్రంలో   మ‌రో  కీల‌క […]

స్వ‌యంగా ర‌జ‌నీకాంతే ఫోన్ చేశారు
X
రెండు బిగ్ డిజాస్ట‌ర్స్ తో త‌న అభిమానుల్ని డిజ‌పాయింట్ చేసిన ర‌జనీకాంత్..లేటెస్ట్ గా కొత్త ద‌ర్శకుడు రంజిత్ తో క‌బాలీ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ విష‌యంలో అనేక గాసిప్స్‌ విపిస్తున్నాయి. సినిమా ప్రారంభంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న బాలీవుడ్ కు చెందిన అనేక మంది ముద్దుగుమ్ముల పేర్లు వినిపించాయి. అయితే చివ‌ర‌కు రాధిక ఆప్టేను ఎంపిక చేశారు.
ఇక తాజా స‌మాచారం ఏమిటంటే.. ఈ చిత్రంలో మ‌రో కీల‌క మైన రోల్ కు ఐశ్వ‌ర్య‌రాయ్ ను ఎంపిక చేసిన‌ట్లు కోలీవుడ్ టాక్. ఈ పాత్ర కు ఐష్ అయితేనే బావుంటుంద‌ని ఫైన‌ల్ చేకున్న తరువాత ర‌జ‌నీకాంతే స్వ‌యంగా ఐశ్వ‌ర్య కు ఫోన్ చేసి యాక్ట్ చేయాల్సిందిగా కోరార‌ట‌. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన రోబో చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. స్క్రీన్ పై ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న ఐశ్వ‌ర్య రాయ్ వంద‌కు వంద శాతం సెట్ అయ్యారు. ప్ర‌స్తుతం చేస్తున్న క‌బాలి సినిమా ఒక మాస్ మ‌సాలా చిత్రం . ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ రెండు పాత్ర‌లు పోషిస్తున్నారు. ఒక రోల్ లో మాఫియా డాన్ గా క‌నిపించ‌నున్నారు. రెండ‌వ రోల్ ఏమిట‌నేది తెలియాల్సి వుంది. మొత్తం మీద రోబో కాంబినేష‌న్ ( హీరో, హీరోయిన్) మ‌రోసారి రిపీట్ కాబోతుంద‌న్న‌మాట‌.
First Published:  27 Oct 2015 7:02 PM GMT
Next Story