Telugu Global
Cinema & Entertainment

షారూక్ కు షాకిచ్చిన ఇడి

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాడు షారూక్. రామోజీ ఫిలింసిటీలో దిల్ వాలే షూటంగ్ లో పాల్గొంటున్నాడు. షారూక్ హైదరాబాద్ లో ఉంటుండగానే, ముంబయిలో ఇడి అతడికి షాకిచ్చింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ షారూక్ కు సమన్లు జారీచేసింది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి ఓనర్ గా ఉన్న షారూక్.. ఆ సీజన్ లో ఫెమా రూల్స్ ను అతిక్రమించారని ఆరోపిస్తూ.. ఈడీ ఈ సమన్లు జారీచేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ […]

షారూక్ కు షాకిచ్చిన ఇడి
X
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాడు షారూక్. రామోజీ ఫిలింసిటీలో దిల్ వాలే షూటంగ్ లో పాల్గొంటున్నాడు. షారూక్ హైదరాబాద్ లో ఉంటుండగానే, ముంబయిలో ఇడి అతడికి షాకిచ్చింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ షారూక్ కు సమన్లు జారీచేసింది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి ఓనర్ గా ఉన్న షారూక్.. ఆ సీజన్ లో ఫెమా రూల్స్ ను అతిక్రమించారని ఆరోపిస్తూ.. ఈడీ ఈ సమన్లు జారీచేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలో షారూక్ తో పాటు జూహిచావ్లా, ఆమె భర్త కూడా ఓనర్లుగా ఉన్నారు. అప్పట్లో వాటాల బదలాయింపుకు సంబంధించి ఫారిన్ ఎక్స్ చేంజ్ రూల్స్ ను వీళ్లంతా అతిక్రమించారని ఆరోపిస్తోంది ఈడీ. అయితే దీనిపై స్పందించడానికి షారూక్ కు సమయం లేదు. అందుకే అతడు ఈడీని మరింత సమయం కోరాడు. ప్రస్తుతం తను ముంబయిలో లేను కాబట్టి.. కాస్త సమయం ఇవ్వమని కోరాడు. దీనిపై ఇంకా ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
First Published:  27 Oct 2015 7:06 PM GMT
Next Story