Telugu Global
Cinema & Entertainment

దీపిక‌ను అలా ఫోర్స్ చేశారట‌..! 

దీపిక ప‌దుకోనే ఈ పేరు చెప్పగానే కళ్ళను కట్టిపడేసే అందాల తార గుర్తుకొస్తుంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘గోలియోం కీ రాస్‌లీలా… రామ్‌లీలా’, ‘పీకూ’ లాంటి చిత్రాల్లో ఆమె అందం, అభినయం ఆహా అనిపించాయి. ఇవాళ భారతీయ సినీరంగంలో పీకూ లాంటి చిత్రాల్లో ఆమె అందం, అభినయం ఆహా అనిపించాయి. ఇంతమంది ఇంతగా మెచ్చుకుంటున్న ఈ దక్షిణాది అమ్మాయికి కూడా ఒకప్పుడు విమర్శలు తప్పలేదట. ఆశ్చర్యంగా ఉంది కదూ! సినిమాల్లో కెరీర్ ప్రారంభించక ముందు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిందిగా […]

దీపిక‌ను అలా ఫోర్స్ చేశారట‌..! 
X
దీపిక ప‌దుకోనే ఈ పేరు చెప్పగానే కళ్ళను కట్టిపడేసే అందాల తార గుర్తుకొస్తుంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘గోలియోం కీ రాస్‌లీలా… రామ్‌లీలా’, ‘పీకూ’ లాంటి చిత్రాల్లో ఆమె అందం, అభినయం ఆహా అనిపించాయి. ఇవాళ భారతీయ సినీరంగంలో పీకూ లాంటి చిత్రాల్లో ఆమె అందం, అభినయం ఆహా అనిపించాయి. ఇంతమంది ఇంతగా మెచ్చుకుంటున్న ఈ దక్షిణాది అమ్మాయికి కూడా ఒకప్పుడు విమర్శలు తప్పలేదట. ఆశ్చర్యంగా ఉంది కదూ! సినిమాల్లో కెరీర్ ప్రారంభించక ముందు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిందిగా దీపికా పదుకొనేకు కొందరు సలహా ఇచ్చారట. ఆ సంగతి స్వయంగా దీపికే ఇప్పుడు బయటపెట్టారు.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దీపిక మాట్లాడుతూ, కెరీర్‌లో తనకు వచ్చిన అతి చెత్త సలహా అదేనంటూ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కొందరు తనకు అలా సలహా ఇచ్చినా, ఎందుకనో ఆ మాట వినలేదంది ఈ అందాల తార. సర్జరీలు ఏమీ చేయించుకోకుండా సహజమైన అందంతోనే ఇప్పుడింతగా పేరు తెచ్చుకున్నందుకు ఆనందం వ్యక్తం చేసింది. అప్పటి శ్రీదేవి దగ్గర నుంచి ఇవాళ్టి కొత్త తరం నటీమణుల దాకా చాలా మంది ప్లాస్టిక్ సర్జరీతో తమ అవయవ సౌష్టవాన్ని మెరుగుపరుచుకున్నారు. ఆ శ్రమ ఏమీ లేకుండానే దీపిక అందరినీ ఆకట్టుకోగలగడం అందానికే కాదు… అదృష్టానికి గీటురాయి కదూ!
Next Story