Telugu Global
National

26 డేంజర్ డేట్

మనదేశంలో 7వ సంఖ్యను కలిసిరానిదిగా భావిస్తారు. గ్రామాల్లోకూడా ఏదైనా కొలిచేటప్పుడు ఆరు అని ఆ తరువాత ఏడును ఆరున్నొక్కటి అంటారు. అలాగే యూరప్‌ దేశాల్లో పదమూడును కలిసిరాని అంకెగా భావిస్తారు. అందుకే అక్కడ హోటల్స్‌లో కూడా 13వ నెంబర్‌ గదులు ఉండవు. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు 26 సంఖ్య డేంజర్ నంబర్స్ లిస్ట్ లో చేరుస్తున్నారు. ప్రపంచంలో సంభవించిన అనేక భూకంపాలు 26వ తేదీనే జరగడం యాదృచ్చికం అని కొందరు అంటూ […]

26 డేంజర్ డేట్
X

మనదేశంలో 7వ సంఖ్యను కలిసిరానిదిగా భావిస్తారు. గ్రామాల్లోకూడా ఏదైనా కొలిచేటప్పుడు ఆరు అని ఆ తరువాత ఏడును ఆరున్నొక్కటి అంటారు. అలాగే యూరప్‌ దేశాల్లో పదమూడును కలిసిరాని అంకెగా భావిస్తారు. అందుకే అక్కడ హోటల్స్‌లో కూడా 13వ నెంబర్‌ గదులు ఉండవు. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు 26 సంఖ్య డేంజర్ నంబర్స్ లిస్ట్ లో చేరుస్తున్నారు. ప్రపంచంలో సంభవించిన అనేక భూకంపాలు 26వ తేదీనే జరగడం యాదృచ్చికం అని కొందరు అంటూ ఉంటే.. మరికొందరు మాత్రం భూకంపాలకు 26కి ఏదో లింకు ఉందని నమ్ముతున్నారు. అందుకే 26వ తేదీని అత్యంత ప్రమాదకర డేట్ గా చెబుతున్నారు. 1531 సంవత్సరం జనవరి 26న పోర్చుగల్ లిస్బెన్ లో సంభవించిన భూకంపం నుంచి 2015 అక్టోబర్ 26 వ తేదీన హిందూకుష్ పర్వతాల్లో సంభవించిన భూకంపం వరకు 26వ తేదీనే రావడం గమనార్హం.
జనవరి 26, 1531 : పోర్చుగల్ లిస్బన్‌లో భూకంపంలో 30 వేల మంది మృత్యువాత
జూలై 26, 1805 : నేపాల్‌, ఇటలీ, కలబ్రియాలో భూకంపం. 26 వేల మంది మరణం.
ఆగస్టు 26, 1883 : అగ్నిపర్వతం బద్ధలు. మృతులు 36 వేల మంది.
డిసెంబర్, 1939, టర్కీలోని ఇర్జిన్‌కాన్‌లో భూకంపం, 41 వేల మంది మృత్యువాత.
జూలై 26, 1963 : యుగోస్లేవియాలో భూకంపం, వెయ్యి మంది మృతి.
జనవరి 26 2001లో గుజరాత్ భూకంపం,వేలాది మంది మరణం
డిసెంబబర్ 26, 2004 : సుమత్రా దీవుల్లో సునామి. వేలమంది దుర్మరణం
మే 26, 2006 : జకర్తాలో భూకంపం.
జూన్ 26, 2010 : టాసిక్‌లో భూకంపం.
అక్టోబర్ 26, 2010 : మెంత్వానిలో సునామీ.
ఇప్పుడు అక్టోబర్ 26 పాక్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో భూకంపం, 700మందికి పైగా మృతి

First Published:  28 Oct 2015 2:19 AM GMT
Next Story