Telugu Global
Cinema & Entertainment

కన్‌ప్యూజన్‌లో క్లారిటీ " మూడో బాహుబలి ఉన్నాడు

రకరకాల ఐడియాలతో బాహుబలిని ఓ రేంజ్‌లో ప్రమోట్ చేసిన రాజమౌళి ఇప్పుడు బాహుబలి-2పై అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు. బాహుబలి-2 ఇంకా రాలేదు. అప్పుడే బాహుబలి-3పై చర్చ పెట్టేశారు. బాహుబలి-3 కూడా ఉందంటూ ప్రచారం మొదలవడంతో  తొలుత ట్విట్టర్‌ ద్వారా లైన్‌లోకి వచ్చిన రాజమౌళి ” మూడో భాగం  కోసం బాహుబలి కథను పొడిగించం. రెండోభాగంతోనే ఆ కథ ముగుస్తుంది. బాహుబలి ప్రయాణం మాత్రం కొనసాగుతుంది” అంటూ ట్వీట్ చేశారు. దీంతో బాహుబలి ప్రస్థానం బహుబలి-3 లేదంటూ మీడియా […]

కన్‌ప్యూజన్‌లో క్లారిటీ  మూడో బాహుబలి ఉన్నాడు
X

రకరకాల ఐడియాలతో బాహుబలిని ఓ రేంజ్‌లో ప్రమోట్ చేసిన రాజమౌళి ఇప్పుడు బాహుబలి-2పై అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు. బాహుబలి-2 ఇంకా రాలేదు. అప్పుడే బాహుబలి-3పై చర్చ పెట్టేశారు. బాహుబలి-3 కూడా ఉందంటూ ప్రచారం మొదలవడంతో తొలుత ట్విట్టర్‌ ద్వారా లైన్‌లోకి వచ్చిన రాజమౌళి ” మూడో భాగం కోసం బాహుబలి కథను పొడిగించం. రెండోభాగంతోనే ఆ కథ ముగుస్తుంది. బాహుబలి ప్రయాణం మాత్రం కొనసాగుతుంది” అంటూ ట్వీట్ చేశారు. దీంతో బాహుబలి ప్రస్థానం బహుబలి-3 లేదంటూ మీడియా ప్రచారం మొదలైంది.

జరిగిన పొరపాటు గమనించిన రాజమౌళి మళ్లీ ట్వీటర్‌లో పోస్టు పెట్టారు. ”క్లారిటీ ఇవ్వబోయి మరింత కన్‌ప్యూజ్ చేశాను. క్షమించండి” అంటూ ట్వీట్ చేశారు. రెండు భాగంతోనే బాహుబలిని ముగించేస్తాం. కానీ, బాహుబలి -3 కూడా ఉంటుంది. ఇప్పటివరకూ ప్రేక్షకులు చూడని రేంజ్‌లో బాహుబలి- 3 ఉంటుందని ప్రకటించారు.

First Published:  25 Oct 2015 10:42 PM GMT
Next Story