Telugu Global
Health & Life Style

అందం, ఆరోగ్యంలో కీలకభూమిక... మందారం

గ్రామాల్లో… పట్టణాల్లో… కాస్తంత స్థలం ఉన్న ప్రతివారూ ఇంట్లో వేసుకునే చెట్టు మందారం. ఇందులో ముద్ద మందారం, రేఖ మందారం అనే రకాలున్నాయి. ఈ రకాలతోపాటు రంగుల్లో కూడా అనేక వ్యత్సాసాలున్నాయి. తెలుగు, ఎరుపు, పసుపు… ఎరుపులో కూడా అనేక షేడ్స్‌తో పూలు పూస్తాయి. ఇలా అనేక రకాలుగా పూచే మందార పూలు అందానికే కాదు… ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఒక్క పూలే కాదు. ఆకులు కూడా ఆయుర్వేదంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. తల ఒత్తుగా […]

అందం, ఆరోగ్యంలో కీలకభూమిక... మందారం
X
గ్రామాల్లో… పట్టణాల్లో… కాస్తంత స్థలం ఉన్న ప్రతివారూ ఇంట్లో వేసుకునే చెట్టు మందారం. ఇందులో ముద్ద మందారం, రేఖ మందారం అనే రకాలున్నాయి. ఈ రకాలతోపాటు రంగుల్లో కూడా అనేక వ్యత్సాసాలున్నాయి. తెలుగు, ఎరుపు, పసుపు… ఎరుపులో కూడా అనేక షేడ్స్‌తో పూలు పూస్తాయి. ఇలా అనేక రకాలుగా పూచే మందార పూలు అందానికే కాదు… ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఒక్క పూలే కాదు. ఆకులు కూడా ఆయుర్వేదంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. తల ఒత్తుగా పెరగడానికి… జుట్టు రాలిపోకుండా ఉండడానికి… చర్మ వ్యాధులు నియంత్రించడానికి మందార పూలు, ఆకులు కూడా ఉపయోగపడతాయి.
మందార ఆకులను నానిన మెంతులతో కలిపి మెత్తగా నూరి తలకు ప్యాక్‌గా వేసి ఆరిన తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేస్తే జట్టు మృదువుగా మారుతుంది. అంతేకాదు జుట్టు రాలడం తగ్గుతుంది. కొబ్బరినూనెలో మందాల పూలను వేసి మరిగించి.. చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే జట్టు వొత్తుగా పెరుగుతుంది. మందార మొక్కలోని ఔషధ గుణాలను ఉపయోగించి ఆయుర్వేదంలో ఎన్నో మందులను తయారు చేస్తారు. బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా రక్త లేమికి మందార పువ్వులను ఉపయోగిస్తారు.
మందాల పువ్వులే కాకుండా ఆకులు కూడా వైద్యంలో ఉపయోగిస్తారు. గర్భాశయ సమస్యలను మందార సహాయంతో నివారిస్తారు. మందాల పూలతో తయారు చేసే టీ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. పసుపు, గులాబీ, తెలుపు రంగుల్లోనూ మందారాలు విరబూసినా.. ఎర్ర మందారాలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. అన్ని రంగుల మందార ఆకుల్లోనూ ఔషధగుణాలు సమానంగానే ఉంటాయి.
First Published:  25 Oct 2015 5:19 AM GMT
Next Story