Telugu Global
Cinema & Entertainment

సినిమా సేఫ్.. చెర్రీ టెన్షన్ పీక్స్

సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్తే చెర్రీ రిలాక్స్ అవ్వాలి కదా.. మరి టెన్షన్ పీక్స్ కు ఎందుకు వెళ్తోంది.. ఇక్కడే ట్విస్ట్ ఉంది. సేఫ్ జోన్ లోకి వెళ్లిన సినిమా చెర్రీది కాదు.. వరుణ్ తేజది. అవును.. బ్రూస్ లీ విడుదలైన కొన్ని రోజుల గ్యాప్ లో థియేటర్లలోకి వచ్చిన వరుణ్ తేజ కంచె సినిమా రెండు రోజులకే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. దీంతో చెర్రీకి టెన్షన్ మరింత పెరిగింది. మెగా కాంపౌండ్ లో […]

సినిమా సేఫ్.. చెర్రీ టెన్షన్ పీక్స్
X
సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్తే చెర్రీ రిలాక్స్ అవ్వాలి కదా.. మరి టెన్షన్ పీక్స్ కు ఎందుకు వెళ్తోంది.. ఇక్కడే ట్విస్ట్ ఉంది. సేఫ్ జోన్ లోకి వెళ్లిన సినిమా చెర్రీది కాదు.. వరుణ్ తేజది. అవును.. బ్రూస్ లీ విడుదలైన కొన్ని రోజుల గ్యాప్ లో థియేటర్లలోకి వచ్చిన వరుణ్ తేజ కంచె సినిమా రెండు రోజులకే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. దీంతో చెర్రీకి టెన్షన్ మరింత పెరిగింది. మెగా కాంపౌండ్ లో ఇప్పటికే ఉన్న పోటీ చాలదన్నట్టు.. ఇప్పుడు వరుణ్ తేజ రూపంలో మరో పోటీ ఎదురైంది చెర్రీకి.
ఇప్పటికే మెగాకాంపౌండ్ లో బన్నీని అంతా నంబర్ వన్ హీరో అంటున్నారు. సినిమా వసూళ్లతో పాటు వ్యక్తిగత ఇమేజ్ కూడా బన్నీకి నంబర్ వన్ స్థానం కట్టబెట్టేలా కనిపిస్తోంది. మరోవైపు సాయిధర్మతేజ రూపంలో ఓ మినిమం గ్యారెంటీ హీరో సిద్ధంగా ఉన్నాడు. ఇక పవన్ కల్యాణ్ తో అయితే చెర్రీని పోల్చడం అనవసరం. ఇలాంటి టైమ్ లో కంచె రూపంలో ఓ హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ. మాంచి హైట్, ఎక్సలెంట్ కలర్ తోపాటు.. బన్నీ, చెర్రీకి కూడా లేని వాయిస్ మాడ్యులేషన్ వరుణ్ సొంతమయ్యేలా కనిపిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో వరుణ్ తేజ నుంచి కూడా చెర్రీకి గట్టి పోటీ ఎదురుకాక తప్పదు. సో.. ఫ్యూచర్ లో మెగాకాంపౌండ్ లోనే రసవత్తర పోరు షురూ కానుంది.
First Published:  24 Oct 2015 7:02 PM GMT
Next Story