Telugu Global
Others

బాబుపై కోడెల గుర్రు

అమరావతి శంకుస్థాపన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అధినేతకు కొత్త సమస్యలు సృష్టిస్తుందా… ఈ అనుమానానికి బీజం వేస్తున్నాయి గుంటూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు. ఇప్పటివరకు ఉద్దండరాయునిపాలెనికే పరిమితమైన అసంతృప్తి జ్వాలలు క్రమంగా పెరుగుతున్నాయి. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో తమకు సరైన ప్రాధాన్యం కల్పించలేదని ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్దండరాయునిపాలెం సర్పంచ్‌తోపాటు ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌, ఎంపీ గల్లా జయదేవ్‌లను చంద్రబాబు నయానో, భయానో అదుపు చేయగలిగారు. ఇపుడు కొత్తగా ఈ జాబితాలోకి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ […]

బాబుపై కోడెల గుర్రు
X

అమరావతి శంకుస్థాపన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అధినేతకు కొత్త సమస్యలు సృష్టిస్తుందా… ఈ అనుమానానికి బీజం వేస్తున్నాయి గుంటూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు. ఇప్పటివరకు ఉద్దండరాయునిపాలెనికే పరిమితమైన అసంతృప్తి జ్వాలలు క్రమంగా పెరుగుతున్నాయి. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో తమకు సరైన ప్రాధాన్యం కల్పించలేదని ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్దండరాయునిపాలెం సర్పంచ్‌తోపాటు ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌, ఎంపీ గల్లా జయదేవ్‌లను చంద్రబాబు నయానో, భయానో అదుపు చేయగలిగారు. ఇపుడు కొత్తగా ఈ జాబితాలోకి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కూడా చేరారు. ఒక చారిత్రాత్మక ఈవెంట్‌ జరిగిన సందర్భంలో తనకు ఏ మాత్రం ప్రాధాన్యత కల్పించలేదని ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ హాజరైన సభకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా పతిగా హాజరయినప్పటికీ వేదికపైకి ఆహ్వానించక పోవడాన్ని కోడెల తప్పు పడుతున్నారు. గుంటూరు జిల్లాకే చెందిన తనను సొంత జిల్లాలో అవమానించినట్టుగా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద కార్యక్రమానికి వేదికపైకి ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సొంత నియోజకవర్గ సభకు ప్రోటోకాల్ పాటించలేదని స్థానిక ఎంపి గల్లా జయదేవ్‌తోపాటు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కూడా అసంతృప్తిలో వెళ్ళగక్కిన విషయం బహిరంగ రహస్యమే. వీరితో పాటు స్థానిక ఉద్దండరాయినిపాలెం సర్పంచ్ కూడా మీడియాతో తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. వీరంతా టిడిపికి చెందినవారే కావడంతో టిడిపిలోని కొంతమంది నేతలు విషయం బయటకు రాకుండా సర్దిచెబుతున్నట్టు తెలుస్తోంది. కోడెల సహజ శైలి తెలిసిన వారు ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ వార్తలు నేపథ్యంలో… తాను ఆశిస్తున్న మంత్రి పదవి ఎక్కడ ట్రాక్‌ నుంచి తప్పిపోతుందోనని తమ నేత వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని పాటిస్తున్నట్టు స్పీకర్ కోడెల అనుచరులు చెబుతున్నారు.

First Published:  24 Oct 2015 11:23 AM GMT
Next Story