Telugu Global
Cinema & Entertainment

ఫ్యాన్స్ కు హ్యాండిచ్చిన వెంకటేష్

దసరా కానుకగా ఒకేసారి రెండు సినిమాలు ప్రారంభిస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. కానీ కనీసం ఒక్క సినిమాను కూడా ప్రారంభించలేదు వెంకటేష్. దీంతో దగ్గుబాటి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. దసరాతో అప్ సెట్ అయ్యారు. నిజానికి వెంకీ దగ్గర రెండు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో రాథ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మరోవైపు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా కూడీ రెడీగా ఉంది. ఈరెండు సినిమాలకు నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నాడు. సురేష్ […]

ఫ్యాన్స్ కు హ్యాండిచ్చిన వెంకటేష్
X
దసరా కానుకగా ఒకేసారి రెండు సినిమాలు ప్రారంభిస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. కానీ కనీసం ఒక్క సినిమాను కూడా ప్రారంభించలేదు వెంకటేష్. దీంతో దగ్గుబాటి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. దసరాతో అప్ సెట్ అయ్యారు. నిజానికి వెంకీ దగ్గర రెండు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో రాథ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మరోవైపు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా కూడీ రెడీగా ఉంది. ఈరెండు సినిమాలకు నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే తెరకెక్కించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇలా అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ.. దసరాకు ఈ రెండు సినిమాల్లో ఒకటి కూడా ప్రారంభించలేకపోయాడు వెంకీ. దీంతో ఫ్యాన్స్ నిరాశచెందారు. అయితే దసరా లాంటి మంచి రోజును వెంకీ ఎందుకు మిస్ చేసుకున్నాడనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంపై సురేష్ బాబు దగ్గర కూడా ఆరా తీసే ప్రయత్నం చేశారు జర్నలిస్టులు. కానీ నిర్మాత సురేష్ నుంచి కూడా మౌనమే సమాధానంగా వచ్చింది.
First Published:  22 Oct 2015 7:02 PM GMT
Next Story