Telugu Global
Cinema & Entertainment

వరుణ్ తేజ్‌ ట్విట్టర్ చాట్ " పంచ్ ప్రశ్నలు

ముకుందతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ”కంచె” దాటేసిన మెగా హీరో వరుణ్ తేజ్ తన అభిమానులతో ట్విట్టర్ ద్వారా లైవ్ చాట్ చేశారు. తన ఆశలు, ఆశయాల గురించి అభిమానులకు ఓప్పిగ్గా సమాధానం చెప్పారు. తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ రుద్రవీణ అని చెప్పారు. ముకుంద ఫస్ట్ డే షూటింగ్ తన జీవితంలో మరిచిపోలేని అత్యంత సంతోషకమైర క్షణాలని గుర్తు చేసుకున్నారు. అవకాశం వస్తే చాలెంజ్ సినిమాను రీమేక్ చేయాలన్నది తన కోరిక అన్నారు. రమ్య […]

వరుణ్ తేజ్‌ ట్విట్టర్ చాట్  పంచ్ ప్రశ్నలు
X

ముకుందతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ”కంచె” దాటేసిన మెగా హీరో వరుణ్ తేజ్ తన అభిమానులతో ట్విట్టర్ ద్వారా లైవ్ చాట్ చేశారు. తన ఆశలు, ఆశయాల గురించి అభిమానులకు ఓప్పిగ్గా సమాధానం చెప్పారు. తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ రుద్రవీణ అని చెప్పారు. ముకుంద ఫస్ట్ డే షూటింగ్ తన జీవితంలో మరిచిపోలేని అత్యంత సంతోషకమైర క్షణాలని గుర్తు చేసుకున్నారు.

అవకాశం వస్తే చాలెంజ్ సినిమాను రీమేక్ చేయాలన్నది తన కోరిక అన్నారు. రమ్య క‌ష్ణ తన కలల నటి అని సెలవిచ్చాడు వరుణ్. అవకాశం వస్తే రమ్యక‌‌ృష్ణతో కలిసి నటించాలని ఉందన్నారు. ఏంజెలినా జోలితో డేటింగ్ చేయాలని కలలు కంటున్నాడట ఈ కుర్రహీరో. ఆ విషయాన్ని కూడా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

సినిమాకు కమిట్ అయ్యే ముందు స్టోరి గురించి తన తండ్రితో చర్చిస్తానన్నారు. చెల్లి నిహారిక సినిమాల్లోకి రావడంపై సంతోషిస్తున్నానని వరుణ్ తేజ్ చెప్పారు. కంచె సినిమా ద్వాారా కులం, మతం, రంగు ఆధారంగా వేరు చేసి చూడకూడదని మనుషులంతా ఒక్కటేనన్న విషయం అర్థమైందన్నారు వరణ్.

First Published:  23 Oct 2015 1:36 AM GMT
Next Story