Telugu Global
Cinema & Entertainment

షారూక్ ఖాన్ కు శివసేన ఎర్త్..

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ కు శివసేన ఎర్త్ పెట్టింది. అతడి సినిమాను అడ్డుకున్నంత పని చేసింది. నిజానికి షారూక్ కు, శివసేనకు ఎలాంటి విబేధాలు లేవు. కానీ అనుకోని విధంగా అలా జరిగిపోయింది. త్వరలోనే రాయీస్ అనే సినిమాను ప్రారంభించబోతున్నాడు షారూక్. రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో మహిరా అనే పాకిస్థానీ నటి నటించాల్సి ఉంది. ఇక్కడే శివసేన-షారూక్ మధ్య చిచ్చు ఏర్పడింది. పాకిస్థాన్ తో ఎలాంటి సంబంధాలు […]

షారూక్ ఖాన్ కు శివసేన ఎర్త్..
X
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ కు శివసేన ఎర్త్ పెట్టింది. అతడి సినిమాను అడ్డుకున్నంత పని చేసింది. నిజానికి షారూక్ కు, శివసేనకు ఎలాంటి విబేధాలు లేవు. కానీ అనుకోని విధంగా అలా జరిగిపోయింది. త్వరలోనే రాయీస్ అనే సినిమాను ప్రారంభించబోతున్నాడు షారూక్. రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో మహిరా అనే పాకిస్థానీ నటి నటించాల్సి ఉంది. ఇక్కడే శివసేన-షారూక్ మధ్య చిచ్చు ఏర్పడింది. పాకిస్థాన్ తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి వీళ్లేదంటూ శివసేన ఓపెన్ కండిషన్ పెట్టింది. ఈమధ్యే గులామ్ అలీ కచేరీలు కూడా రద్దుచేయించింది. పాక్ క్రికెట్ బోర్డుతో చర్చిస్తున్న బీసీసీఐని ఘెరావ్ చేసింది. ఓ సినిమా ప్రమోషన్ కోసం ఇండియాకు రాబోతున్న ఇద్దరు నటీనటులకు వ్యతిరేకంగా ధర్నా కూడా చేసింది. ఇలాంటి టైమ్ లో రాయిస్ సినిమాలో మహిరా నటిస్తే సహించమని గట్టి హెచ్చరిక జారీచేసింది శివసేన. మరోవైపు మహిరా కోసం ఆడిషన్స్ పూర్తిచేసి, కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు మేకర్స్. ఆమెతో అగ్రిమెంట్ కుదుర్చుకొని, అడ్వాన్స్ పేమెంట్ కూడా ఇచ్చేశారు. ఇలాంటి టైమ్ లో ఈ వివాదంపై షారూక్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
First Published:  22 Oct 2015 11:30 PM GMT
Next Story