Telugu Global
Cinema & Entertainment

అమీర్ ఖాన్ హీరోగా సల్మాన్ నిర్మాతగా

వీళ్లిద్దర్నీ హీరోలుగా పెట్టి ఓ భారీ మల్టీస్టారర్ తీయాలనే ప్రయత్నం ఎప్పట్నుంచో జరుగుతోంది. కానీ కాంబినేషన్ మాత్రం సెట్ అవ్వట్లేదు. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ సల్మాన్-అమీర్ మాత్రం సెట్స్ పైకి కలిసి రాలేకపోయారు. ఇలాంటి టైమ్ లో ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు సల్మాన్ ఖాన్. కలిసి స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా కలిసి పనిచేశాం అనే అనుభూతిని ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే తన బ్యానర్ పై అమీర్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు సల్మాన్. […]

అమీర్ ఖాన్ హీరోగా సల్మాన్ నిర్మాతగా
X
వీళ్లిద్దర్నీ హీరోలుగా పెట్టి ఓ భారీ మల్టీస్టారర్ తీయాలనే ప్రయత్నం ఎప్పట్నుంచో జరుగుతోంది. కానీ కాంబినేషన్ మాత్రం సెట్ అవ్వట్లేదు. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ సల్మాన్-అమీర్ మాత్రం సెట్స్ పైకి కలిసి రాలేకపోయారు. ఇలాంటి టైమ్ లో ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు సల్మాన్ ఖాన్. కలిసి స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా కలిసి పనిచేశాం అనే అనుభూతిని ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే తన బ్యానర్ పై అమీర్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు సల్మాన్. ఈ విషయాన్ని మీడియాకు కూడా స్పష్టంచేశాడు. తాజాగా ఈ కండలవీరుడు ఆదిత్య పంచోళీ కొడుకును హీరోగా పరిచయం చేశాడు. త్వరలోనే సునీల్ షెట్టి కొడుకును కూడా హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అమీర్ తో సినిమా చేస్తానంటున్నాడు సల్మాన్. కుదిరితే ఆ సినిమాలో ఓ అతిథి పాత్రలో కూడా కనిపిస్తానని ఊరిస్తున్నాడు.
First Published:  22 Oct 2015 7:05 PM GMT
Next Story