Telugu Global
CRIME

జల వివాదం... తనయుడి చేతిలో తండ్రి హతం

పొలం దగ్గర వచ్చిన జల వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తన పొలం నుంచి చిన్న కొడుకు నీళ్ళు తీసుకోవడం ఇష్టం లేని తండ్రి కొడుకుతో గొడవ పడడంతో వివాదం కాస్తా చినికిచినికి గాలివానగా మారి చివరకు ప్రాణం తీసింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో ఆయేటి భోజన్న(60) అతని రెండో కుమారుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉండగా పెద్దకుమారుడు […]

పొలం దగ్గర వచ్చిన జల వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తన పొలం నుంచి చిన్న కొడుకు నీళ్ళు తీసుకోవడం ఇష్టం లేని తండ్రి కొడుకుతో గొడవ పడడంతో వివాదం కాస్తా చినికిచినికి గాలివానగా మారి చివరకు ప్రాణం తీసింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో ఆయేటి భోజన్న(60) అతని రెండో కుమారుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉండగా పెద్దకుమారుడు చనిపోవడంతో అతని పొలం పనులను తండ్రి దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో రెండో కుమారుడు రవీందర్ తన పొలానికి పెద్ద కుమారుడి పొలం నుంచి నీటిని మళ్లించుకునేందుకు ప్రయత్నించాడు. దీన్ని అడ్డుకున్న తండ్రితో చిన్న కొడుకు గొడవ పడ్డాడు. తండ్రి కొడుకులకు జరిగిన వివాదంలో ఆవేశానికి లోనైన ఇరువురు తోపులాడుకున్నారు. తండ్రిని కట్టెతో బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. భయానికి లోనైన రవీందర్ సమాచారాన్ని కుటుంబీకులకు చేరవేశాడు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు భోజన్నను ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుని భార్య లింగు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  22 Oct 2015 4:01 PM GMT
Next Story