Telugu Global
Cinema & Entertainment

వెంకీ ఒకేసారి రెండు అంటున్నాడు

‘గోపాల గోపాల ‘ రిలీజ్ అయ్యి దాదాపు తొమ్మిది నెలలు పూర్తి అయిపోయాయి. కాని విక్టరి వెంకటేష్ ఇప్పటివరకు ఒక్క కొత్త సినీమా కూడా ఓకే చేయలేదు. వెంకీ ఫ్యాన్స్ చాలా బెంగపడిపోయారు ఇంత పెద్ద గ్యాప్ వచ్చినందుకు. మొత్తానికి మధ్యలో ఆగిపోయిన మారుతి సినిమాకి రెక్కలొచ్చినట్లే ఉన్నాయి. వెంకీ త్వరలో మారుతితో సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి అది అప్పట్లో ఆగిపోయినా స్క్రిప్టా..? లేక ఇంకో కొత్త కథా..? అనే విషయం తెలియాల్సి ఉంది.  […]

వెంకీ ఒకేసారి రెండు అంటున్నాడు
X

‘గోపాల గోపాల ‘ రిలీజ్ అయ్యి దాదాపు తొమ్మిది నెలలు పూర్తి అయిపోయాయి. కాని విక్టరి వెంకటేష్ ఇప్పటివరకు ఒక్క కొత్త సినీమా కూడా ఓకే చేయలేదు. వెంకీ ఫ్యాన్స్ చాలా బెంగపడిపోయారు ఇంత పెద్ద గ్యాప్ వచ్చినందుకు. మొత్తానికి మధ్యలో ఆగిపోయిన మారుతి సినిమాకి రెక్కలొచ్చినట్లే ఉన్నాయి. వెంకీ త్వరలో మారుతితో సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి అది అప్పట్లో ఆగిపోయినా స్క్రిప్టా..? లేక ఇంకో కొత్త కథా..? అనే విషయం తెలియాల్సి ఉంది.
మారుతి సినిమాతోపాటు, ఇంకొక సినిమాకు కూడా వెంకీ ఓకే చేసినట్లు తెలుస్తోంది. అది ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ‘ డైరెక్టర్ క్రాంతి మాదవ్ తో. మారుతి సినిమాతో పాటు, క్రాంతి మాదవ్ సినిమా కూడా సైమల్‌టేనియస్‌గా షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తోంది. ఇంత గ్యాప్ వచ్చినందుకు.. వెంకీ ఒకేసారి రెండు సినిమాలు ఒప్పుకోవడం ఫ్యాన్స్ కి పండుగ లాంటి వార్త. ఈ రెండు సినిమాల వివరాలు ఇంకా అఫీషియల్‌గా ప్రకటించాల్సి ఉంది. అంటే 2016లో వెంకీవి రెండు సినిమాలు విడుదల అవుతాయి అన్నమాట.

First Published:  21 Oct 2015 7:29 PM GMT
Next Story