Telugu Global
Cinema & Entertainment

సీనియర్ హీరోతో తేజ సినిమా

తేజ సినిమాల్లో సీనియర్లు కనిపించరు. అంతా కొత్త నటీనటులే కనిపిస్తారు. హీరోలైనా, హీరోయిన్లయినా, క్యారెక్టర్ ఆర్టిస్టులైనా అంతా కొత్తవాళ్లే ఉంటారు తేజ సినిమాలో. మరీ కుదరదనుకుంటే ఓ మోస్తరు ఎక్స్ పీరియన్స్ ఉన్న నటుల్ని మాత్రమే పెట్టుకుంటాడు. స్టార్ డమ్ ఉన్న నటీనటులు ఎవర్నీ తన సినిమాల్లోకి తీసుకోడు. ఇలా ఓ రూల్ ఫిక్స్ చేసుకున్నాడు తేజ. కానీ ఈ రూల్ నుంచి ఇప్పుడు బయటకొచ్చి ఓ స్టార్ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నాడు ఈ దర్శకుడు. సీనియర్ […]

సీనియర్ హీరోతో తేజ సినిమా
X
తేజ సినిమాల్లో సీనియర్లు కనిపించరు. అంతా కొత్త నటీనటులే కనిపిస్తారు. హీరోలైనా, హీరోయిన్లయినా, క్యారెక్టర్ ఆర్టిస్టులైనా అంతా కొత్తవాళ్లే ఉంటారు తేజ సినిమాలో. మరీ కుదరదనుకుంటే ఓ మోస్తరు ఎక్స్ పీరియన్స్ ఉన్న నటుల్ని మాత్రమే పెట్టుకుంటాడు. స్టార్ డమ్ ఉన్న నటీనటులు ఎవర్నీ తన సినిమాల్లోకి తీసుకోడు. ఇలా ఓ రూల్ ఫిక్స్ చేసుకున్నాడు తేజ. కానీ ఈ రూల్ నుంచి ఇప్పుడు బయటకొచ్చి ఓ స్టార్ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నాడు ఈ దర్శకుడు. సీనియర్ మోస్ట్ హీరో రాజశేఖర్ తో ఓ సినిమా చేసేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నాడు. రాజశేఖర్ భార్య జీవిత ఈ కాంబినేషన్ సెట్ అవ్వడానికి తెరవెనక చాలా కృషి చేశారని తెలుస్తోంది. అయితే సీనియర్లతో కలిసి పనిచేయనని చెప్పిన తేజ ఇలా మనసు మార్చుకోవడానికి కారణం ఏంటనే విషయం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. రీసెంట్ గా తేజ తీసిన హోరాహోరీ సినిమా బాక్సాఫీస్ ముందు అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమా రిజల్ట్ తో తేజ తన నిర్ణయం మార్చుకున్నాడని అంటున్నారు చాలామంది.
First Published:  21 Oct 2015 2:07 PM GMT
Next Story