Telugu Global
International

అణ్వస్త్రాల్లో భారత్‌పై పాక్‌ పైచేయి!

అణ్వస్త్రాలున్న దేశాల్లో పాకిస్థాన్‌ మరో పదేళ్ళలో భారత్‌ను మించి పోతుందని అమెరికా చెబుతోంది. అణ్వస్త్రాల తయారీని నిలిపి వేయాలని ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఓ వైపు కోరుతున్నా అవి కొన్ని దేశాలు పెడచెవిన పెడుతున్నాయి. దీంతో అనివార్యంగా అణ్వస్త్రాల తయారీ పోటీ కొనసాగుతోంది. దీని ఫలితమే పాకిస్థాన్‌ ఆ రేసులో ముందుందని చెబుతున్న నివేదికలు. వచ్చే పదేళ్లలో పాకిస్థాన్ భారత్‌ను మించి ప్రపంచంలో 5వ అణ్వాస్త్ర దేశంగా విరాజిల్లుతుందని అమెరికాకు చెందిన అటామిక్ […]

అణ్వస్త్రాల్లో భారత్‌పై పాక్‌ పైచేయి!
X

అణ్వస్త్రాలున్న దేశాల్లో పాకిస్థాన్‌ మరో పదేళ్ళలో భారత్‌ను మించి పోతుందని అమెరికా చెబుతోంది. అణ్వస్త్రాల తయారీని నిలిపి వేయాలని ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఓ వైపు కోరుతున్నా అవి కొన్ని దేశాలు పెడచెవిన పెడుతున్నాయి. దీంతో అనివార్యంగా అణ్వస్త్రాల తయారీ పోటీ కొనసాగుతోంది. దీని ఫలితమే పాకిస్థాన్‌ ఆ రేసులో ముందుందని చెబుతున్న నివేదికలు. వచ్చే పదేళ్లలో పాకిస్థాన్ భారత్‌ను మించి ప్రపంచంలో 5వ అణ్వాస్త్ర దేశంగా విరాజిల్లుతుందని అమెరికాకు చెందిన అటామిక్ సెన్స్‌ అంచనా వేసింది. రెండు దశాబ్దాలుగా పాక్ అణ్వాయుధాలపై దృష్టి పెట్టిందని, ప్రస్తుతం ఆ దేశం వద్ద వందకుపైగా వార్‌ హెడ్స్ ఉన్నట్లు విశ్లేషించింది. 2025 నాటికి పాక్ అణ్వాస్త్రాల సంఖ్య 250కి చేరవచ్చని పేర్కొంది. అప్పటికి 6వ స్థానంలో నిలిచే భారత్ న్యూక్లియర్ కార్యకలాపాల ఆధారంగానే అణ్వాయుధాలను పాక్ సమకూర్చుకుంటుందని విశ్లేషించింది. మరోపక్క పాకిస్థాన్‌ అంబులపొదిలో ఎనిమిది ఎఫ్16 ఫైటర్ జెట్స్‌ చేరేందుకు మార్గం సుగమమయ్యింది. ఇవి అమ్మేందుకు అమెరికా సమాయత్తమైంది. త్వరలో జరగనున్న ఒబామాతో షరీఫ్ భేటీ సందర్భంగా ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఈ ఒప్పందంపై చర్చించే అవకాశముంది.

First Published:  21 Oct 2015 1:04 PM GMT
Next Story