Telugu Global
Cinema & Entertainment

పవన్ ఇంటి ముందు ఫ్యాన్స్ రచ్చ

హీరో పవన్ కల్యాణ్ ఇంటి ముందు ముగ్గురు వ్యక్తులు రభస సృష్టించారు. పవన్ ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వీరిని పవన్ ఇంటి వద్ద ఉన్నసెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సెక్యూరిటీ సిబ్బందితో వారితో చాలా సేపు గొడవపడ్డారు. మంగళవారం రాత్రి 10. 30 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. బాగా మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు తొలుత పవన్ఇంటి వద్దకు వచ్చారు. తాము పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌మంటూ వెంటనే ఆయనతో సెల్ఫీ దిగుతామంటూ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. […]

పవన్ ఇంటి ముందు ఫ్యాన్స్ రచ్చ
X

హీరో పవన్ కల్యాణ్ ఇంటి ముందు ముగ్గురు వ్యక్తులు రభస సృష్టించారు. పవన్ ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వీరిని పవన్ ఇంటి వద్ద ఉన్నసెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సెక్యూరిటీ సిబ్బందితో వారితో చాలా సేపు గొడవపడ్డారు.

మంగళవారం రాత్రి 10. 30 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. బాగా మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు తొలుత పవన్ఇంటి వద్దకు వచ్చారు. తాము పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌మంటూ వెంటనే ఆయనతో సెల్ఫీ దిగుతామంటూ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పవన్ ప్రస్తుతం ఇంటిలో లేరని చెప్పినా వినలేదు. ఓ దశలో సెక్యూరిటీని తోసుకుని లోనికి పరిగెత్తారు.

ఇంతలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ముగ్గురుని బంధించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు కానీ, మరే నష్టమూ జరగలేదని బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. ఈ ఘటన గురించి ఇంటి సిబ్బంది వెంటనే గుజరాత్‌లో ఉన్న పవన్‌కు తెలియజేశారు. ఈ ఘటన నేపథ్యంలో పవన్ ఇంటి వద్ద భద్రత పెంచాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.

Next Story