Telugu Global
Cinema & Entertainment

రోబో-2లో ఆర్నాల్డ్ ఎంట్రీ నిజమే..

రోబో-2 సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్‌ ష్వాజ్ నెగ్గర్ ను సంప్రదించారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ వార్తలు నిజమేనని ఇప్పుడు తేలింది. శంకర్ టీం ఈ విషయాన్ని స్పష్టంచేసింది. రోబో-2 సినిమాలో రజనీకాంత్ కు ప్రతినాయకుడిగా ఆర్నాల్డ్ ను నటింపజేసేందుకు శంకర్ తీవ్రంగా ప్రయత్నించారు. స్టోరీలైన్ ను, సినిమాలో పాత్రను ఆర్నాల్డ్ కు వివరించారు. అయితే ఆర్నాల్డ్ మాత్రం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తన పాత్రకు టెస్ట్ కట్ పూర్తయిన తర్వాతే సినిమాపై […]

రోబో-2లో ఆర్నాల్డ్ ఎంట్రీ నిజమే..
X
రోబో-2 సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్‌ ష్వాజ్ నెగ్గర్ ను సంప్రదించారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ వార్తలు నిజమేనని ఇప్పుడు తేలింది. శంకర్ టీం ఈ విషయాన్ని స్పష్టంచేసింది. రోబో-2 సినిమాలో రజనీకాంత్ కు ప్రతినాయకుడిగా ఆర్నాల్డ్ ను నటింపజేసేందుకు శంకర్ తీవ్రంగా ప్రయత్నించారు. స్టోరీలైన్ ను, సినిమాలో పాత్రను ఆర్నాల్డ్ కు వివరించారు. అయితే ఆర్నాల్డ్ మాత్రం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తన పాత్రకు టెస్ట్ కట్ పూర్తయిన తర్వాతే సినిమాపై క్లారిటీ ఇస్తానన్నాడు. ముందు తనతో కొన్ని సన్నివేశాలు తీయమని శంకర్ కు పురమాయించాడు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో అదే పనిలో ఉన్నాడట శంకర్. ఈ టెస్ట్ కట్ కంప్లీట్ అయి, ఆర్నాల్డ్ కు నచ్చితే అప్పుడు రోబో-2లో నటించేందుకు ఒప్పుకుంటాడట శంకర్. అయితే ఈ సినిమా కోసం వంద కోట్ల రూపాయల్ని ఆర్నాల్డ్ డిమాండ్ చేశాడనే వార్తల్లో మాత్రం నిజం లేదంటోంది రోబో-2 టీం.
First Published:  22 Oct 2015 1:05 AM GMT
Next Story