Telugu Global
Cinema & Entertainment

డిక్టేటర్ తో పని పూర్తిచేసిన అంజలి

ప్రస్తుతం బాలయ్యతో కలిసి డిక్టేటర్ అనే సినిమా చేస్తోంది అంజలి. శ్రీవాస్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. మరో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. తాజా అప్ డేట్స్ ప్రకారం.. ఈ సినిమాలో అంజలి నటించాల్సిన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కేవలం అంజలితో చేయాల్సిన పాట ఒక్కటే మిగిలి ఉంది. వచ్చే నెలలో ఆ పాట షూటింగ్ ఉంటుంది. అప్పుడు ఓ 5 రోజులు కాల్షీట్లు కేటాయిస్తే.. డిక్టేటర్ తో అంజలి […]

డిక్టేటర్ తో పని పూర్తిచేసిన అంజలి
X
ప్రస్తుతం బాలయ్యతో కలిసి డిక్టేటర్ అనే సినిమా చేస్తోంది అంజలి. శ్రీవాస్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. మరో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. తాజా అప్ డేట్స్ ప్రకారం.. ఈ సినిమాలో అంజలి నటించాల్సిన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కేవలం అంజలితో చేయాల్సిన పాట ఒక్కటే మిగిలి ఉంది. వచ్చే నెలలో ఆ పాట షూటింగ్ ఉంటుంది. అప్పుడు ఓ 5 రోజులు కాల్షీట్లు కేటాయిస్తే.. డిక్టేటర్ తో అంజలి పని అయిపోయినట్టే. మరోవైపు ఈ సినిమాలో మూడో హీరోయిన్ గా సెలక్ట్ అయిన అక్షతో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య-అక్ష మధ్య వచ్చే సీన్లు పిక్చరైజ్ చేస్తున్నారు. వచ్చేనెల మూడోవారానికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకుంది యూనిట్. డిసెంబర్ లో ఆడియో విడుదల చేసి సంక్రాంతి కానుకగా జనవరి 14న డిక్టేటర్ ను థియేటర్లలోకి దించాలనుకుంటోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. బాలయ్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
First Published:  21 Oct 2015 6:07 PM GMT
Next Story