Telugu Global
Cinema & Entertainment

కుమారి కోసం మెట్టుదిగిన బన్నీ

ప్రస్తుతం ఇండస్ట్రీని ఆకర్షిస్తున్న సినిమాల్లో ఒకటి కుమారి 21-ఎఫ్. ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించాడు. హీబా పటేల్ హీరోయిన్ గా నటించింది. అయితే జనాల్ని ఎట్రాక్ట్ చేస్తున్న ఎలిమెంట్స్ ఇవి కావు. ఈ సినిమాకు కథ, కథనం అందించింది సుకుమార్. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది దేవిశ్రీప్రసాద్. ఈ అంశాలు మాత్రమే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు వీటితో పాటు మరో ఎలిమెంట్ కూడా ఈ సినిమాకు తోడైంది. కుమారి 21-ఎఫ్ […]

కుమారి కోసం మెట్టుదిగిన బన్నీ
X
ప్రస్తుతం ఇండస్ట్రీని ఆకర్షిస్తున్న సినిమాల్లో ఒకటి కుమారి 21-ఎఫ్. ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించాడు. హీబా పటేల్ హీరోయిన్ గా నటించింది. అయితే జనాల్ని ఎట్రాక్ట్ చేస్తున్న ఎలిమెంట్స్ ఇవి కావు. ఈ సినిమాకు కథ, కథనం అందించింది సుకుమార్. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది దేవిశ్రీప్రసాద్. ఈ అంశాలు మాత్రమే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు వీటితో పాటు మరో ఎలిమెంట్ కూడా ఈ సినిమాకు తోడైంది. కుమారి 21-ఎఫ్ ఆడియో ఫంక్షన్ కు బన్నీ ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నాడు. ఈనెల 31న గ్రాండ్ గా జరగనున్న ఆడియో ఫంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నాడు అల్లు అర్జున్. చిన్న సినిమానే అయినప్పటికీ, కేవలం సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కోసం ఓ మెట్టుదిగి ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చేందుకు అంగీకరించాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో ఆర్య, ఆర్య-2 సినిమాలు చేశాడు బన్నీ. అటు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వంలో ఎన్నో హిట్ సినిమాలు చేశాడు. ఆ అభిమానంతోనే ఈ చిన్న సినిమా ఆడియో పంక్షన్ కు వచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను ఎన్టీఆర్ ఆవిష్కరించాడు. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ కు బన్నీ రాబోతున్నాడు. త్వరలోనే సినిమాకు భారీ ప్రమోషన్ కల్పించాలనుకుంటున్నారు. అప్పుడు మహేష్ ను రంగంలోకి దించాలని భావిస్తున్నాడు సుకుమార్.
First Published:  21 Oct 2015 8:28 PM GMT
Next Story