Telugu Global
Cinema & Entertainment

బాహుబలి-2లో సూర్య, శ్రియ

బాహుబలి సినిమాకు ఫాలో అయినట్టుగానే పార్ట్-2కు కూడా సేమ్ ఫార్ములా ఫాలో అవుతున్నాడు రాజమౌళి. సినిమాను స్టార్ ఎట్రాక్షన్ తో నింపేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ఉన్న ప్రభాస్, రానా, అనుష్క, తమన్న, రమ్యకృష్ణ లాంటి స్టార్ ఎట్రాక్షన్ కు తోడు ఇప్పుడు సూర్య, శ్రియను కూడా రంగంలోకి దింపాలని భావిస్తున్నాడు. బాహుబలి సినిమాలో ఇప్పటికే నటించాడు సుదీప్. పార్ట్-2లో ఇంకాస్త ఎక్కువ సమయమే కనిపించనున్నాడు. ప్రభాస్-సుదీప్ మధ్య వచ్చే సన్నివేశాలు పార్ట్-2లోనే కనిపిస్తాయి. అయితే సూర్య […]

బాహుబలి-2లో సూర్య, శ్రియ
X
బాహుబలి సినిమాకు ఫాలో అయినట్టుగానే పార్ట్-2కు కూడా సేమ్ ఫార్ములా ఫాలో అవుతున్నాడు రాజమౌళి. సినిమాను స్టార్ ఎట్రాక్షన్ తో నింపేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ఉన్న ప్రభాస్, రానా, అనుష్క, తమన్న, రమ్యకృష్ణ లాంటి స్టార్ ఎట్రాక్షన్ కు తోడు ఇప్పుడు సూర్య, శ్రియను కూడా రంగంలోకి దింపాలని భావిస్తున్నాడు. బాహుబలి సినిమాలో ఇప్పటికే నటించాడు సుదీప్. పార్ట్-2లో ఇంకాస్త ఎక్కువ సమయమే కనిపించనున్నాడు. ప్రభాస్-సుదీప్ మధ్య వచ్చే సన్నివేశాలు పార్ట్-2లోనే కనిపిస్తాయి. అయితే సూర్య రాకతో సుదీప్ కు ఎర్త్ పడింది. సూర్య కోసం సృష్టించిన పాత్ర కోసం సుదీప్ పాత్ర నిడివిని తగ్గించాలని ఫిక్స్ అయ్యాడట జక్కన్న. మరోవైపు శ్రియను కూడా ఈ సినిమా కోసం తీసుకోవాలని నిర్ణయించాడట. మరి శ్రిను ఏదైనా పాత్ర కోసం తీసుకుంటున్నాడా లేక పార్ట్-2లో వచ్చే ఐటెంసాంగ్ కోసం తీసుకుంటున్నాడా అనే విషయం స్పష్టంకాలేదు. పార్ట్-1లో పెట్టిన ఐటెంసాంగ్ హిట్ అయినప్పటికీ అందులో నటించిన భామలు ఆడియన్స్ తో కనెక్ట్ కాలేకపోయారు. అందుకే పార్ట్-2లో పెట్టే ఐటెంసాంగ్ కోసం శ్రియను తీసుకున్నట్టు తెలుస్తోంది.
First Published:  20 Oct 2015 1:01 PM GMT
Next Story