Telugu Global
Others

ఆ జ్ఞాప‌కం...బాల్యం చేసిన‌ సంత‌కం!

పెద్ద‌య్యాక చాలా సాధార‌ణం అనిపించే విష‌యాలు, అస‌లు విష‌యాలే కానివి… చిన్న‌త‌నంలో అద్భుతంగా అనిపిస్తాయి. అందుకే బాల్యం అంద‌మైన‌ది, అద్భుత‌మైంది. వ‌య‌సు, తెలివితేట‌లు వ‌చ్చాక ఆ ఆనందాలు మాయం అయిపోతాయి. వాటితాలూకూ తీపి గుర్తులు మాత్రం మిగులుతాయి. విచిత్రం ఏమిటంటే చిన్న‌ప్ప‌టి తెలివిత‌క్కువ ఆలోచ‌న‌లు, ప‌నులు పెద్ద‌య్యాక త‌లుచుకుంటే మాత్రం…ఆ ఏముందిలే అని ప‌క్క‌కు నెట్టేయ‌లేము, ఆ జ్ఞాప‌కాలు ఇచ్చిన అనుభూతుల‌ను తాజాగా నెమ‌రువేసుకుంటాం. అవును మ‌న‌మూ ఇలాగే చేశాం…అని అంద‌రూ అనుకునే చిన్న‌నాటి చిలిపిప‌నులు ఇవి…మీరూ చ‌దివి పెద‌వుల‌పైకి ఓ జ్ఞాప‌కాల చిరున‌వ్వు తెమ్మెర‌ని తెచ్చుకోండి- -చేతుల‌ను ష‌ర్టులోప‌లికి […]

ఆ జ్ఞాప‌కం...బాల్యం చేసిన‌ సంత‌కం!
X

పెద్ద‌య్యాక చాలా సాధార‌ణం అనిపించే విష‌యాలు, అస‌లు విష‌యాలే కానివి… చిన్న‌త‌నంలో అద్భుతంగా అనిపిస్తాయి. అందుకే బాల్యం అంద‌మైన‌ది, అద్భుత‌మైంది. వ‌య‌సు, తెలివితేట‌లు వ‌చ్చాక ఆ ఆనందాలు మాయం అయిపోతాయి. వాటితాలూకూ తీపి గుర్తులు మాత్రం మిగులుతాయి. విచిత్రం ఏమిటంటే చిన్న‌ప్ప‌టి తెలివిత‌క్కువ ఆలోచ‌న‌లు, ప‌నులు పెద్ద‌య్యాక త‌లుచుకుంటే మాత్రం…ఆ ఏముందిలే అని ప‌క్క‌కు నెట్టేయ‌లేము, ఆ జ్ఞాప‌కాలు ఇచ్చిన అనుభూతుల‌ను తాజాగా నెమ‌రువేసుకుంటాం. అవును మ‌న‌మూ ఇలాగే చేశాం…అని అంద‌రూ అనుకునే చిన్న‌నాటి చిలిపిప‌నులు ఇవి…మీరూ చ‌దివి పెద‌వుల‌పైకి ఓ జ్ఞాప‌కాల చిరున‌వ్వు తెమ్మెర‌ని తెచ్చుకోండి-

unnamed (2)-చేతుల‌ను ష‌ర్టులోప‌లికి పెట్టేసుకుని…నా చేతుల్లేవోచ్….అని చెప్ప‌డం.

-ఆట‌లు ఆడేట‌ప్పుడు తోబుట్టువుల‌తో త‌గువులు ప‌డ‌టం…మ‌నం ఓడిపోతే…తూచ్ మ‌ళ్లీ మొద‌టినుండి ఆడాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్ట‌డం

-బొమ్మ‌ల‌న్నింటినీ ప‌క్క‌న‌పెట్టుకుని నిద్ర‌పోవ‌డం…ఎందుకంటే దేన్ని వ‌దిలేసినా అది బాధ‌ప‌డుతుంద‌ని న‌మ్మ‌డం వ‌ల‌న‌.

-ఆరు రంగుల రీఫిల్స్ ఉన్న పెన్నుని వాడుతూ, వాట‌న్నింటినీ ఒకేసారి కిందికి తేవాల‌ని ప్ర‌య‌త్నించ‌డం.

unnamed (3)-ఇంట్లోకి వ‌చ్చేవారిని భ‌య‌పెట్టాల‌ని త‌లుపు చాటుకి వెళ్లి దాక్కోవ‌డం…అలా కాసేపు ఎదురు చూసి, వాళ్లొచ్చేదాకా ఆగ‌లేక బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం.

-అంద‌రితో క‌లిసి సినిమాకో, షాపింగ్‌కో వెళ్లి రాత్రులు తిరిగి వ‌స్తున్న‌పుడు… నాన్న ఎత్తుకుంటాడ‌ని…నిద్ర‌ని న‌టించ‌డం.

unnamed (1)-మ‌నం న‌డుస్తున్న‌పుడు, బ‌స్సు, రైళ్ల‌లో ప్ర‌యాణాలు చేస్తున్న‌పుడు చంద్రుడు కూడా మ‌న‌తో వ‌స్తున్నాడ‌ని ఆశ్చ‌ర్యంగా గ‌మ‌నించ‌డం.

-కిటికీలోంచి వ‌ర్షాన్ని చూడ‌టం. ఏ చినుకు వేగంగా ప‌డుతుందో చూడాల‌ని ప్ర‌య‌త్నించ‌డం.

-పొర‌బాటున ప‌ళ్ల‌కు సంబంధించిన గింజ‌ల‌ను మింగేసి, పొట్ట‌లో చెట్లు మొలుస్తాయేమో అని భ‌య‌ప‌డ‌టం.

-చేతుల‌కు జిగురు రాసుకుని అది ఆరిపోయాక దాన్ని లాగేస్తూ…అది పొర‌లా వ‌చ్చేస్తుంటే చ‌ర్మ‌మే అలా వ‌స్తుంద‌ని ఫీల‌యిపోవ‌డం.

First Published:  20 Oct 2015 7:51 PM GMT
Next Story