Telugu Global
Cinema & Entertainment

దసరా కానుకగా నాన్నకు ప్రేమతో..

ఎన్టీఆర్ నటిస్తున్న నయా మూవీ నాన్నకు ప్రేమతో. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఊహించని విధంగా దసరాకే విడుదల అంటూ ప్రకటన వచ్చేసింది. అయితే సినిమా విడుదల కాదు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ను దసరాకు విడుదల చేస్తున్నారు. దసరా రోజున సాయంత్రం 6 గంటలకు నాన్నకు ప్రేమతో ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేస్తారు. ఈ సినిమాకు […]

దసరా కానుకగా నాన్నకు ప్రేమతో..
X
ఎన్టీఆర్ నటిస్తున్న నయా మూవీ నాన్నకు ప్రేమతో. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఊహించని విధంగా దసరాకే విడుదల అంటూ ప్రకటన వచ్చేసింది. అయితే సినిమా విడుదల కాదు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ను దసరాకు విడుదల చేస్తున్నారు. దసరా రోజున సాయంత్రం 6 గంటలకు నాన్నకు ప్రేమతో ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేస్తారు. ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ లుక్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు కాబట్టి.. టైటిల్ లోగోతో పాటు మరికొన్ని ఎన్టీఆర్ ఫొటోల్ని విడుదల చేసే ఆవకాశముంది. మరోవైపు ఫస్ట్ లుక్ టీజర్ అని చెప్పినప్పటికీ.. కేవలం టైటిల్, ఫొటోతో డిజిటల్ పోస్టర్ మాదిరిగా టీజర్ ను విడుదల చేస్తారని మరికొందరు భావిస్తున్నారు. నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించి ఈ టీజర్ సస్పెన్స్ వీడాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. కాకపోతే.. ఒకటి మాత్రం వాస్తవం. సుకుమార్ సినిమాలు ఎంత విలక్షణంగా ఉంటాయో.. అతడి టేకింగ్, టీజర్ లుక్స్ కూడా అంతే డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి.. దసరా కానుకగా వస్తున్న నాన్నకు ప్రేమతో టీజర్ కూడా కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుంది.
First Published:  20 Oct 2015 7:02 PM GMT
Next Story