Telugu Global
Cinema & Entertainment

షేర్ దసరాకి రావట్లేదా..?

తను నటించిన షేర్ సినిమాను దసరాకు విడుదల చేస్తున్నట్టు కల్యాణ్ రామ్ గతంలో ప్రకటించాడు. కానీ ఇప్పుడు మాత్రం తేదీని అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా షేర్ సినిమా సెన్సార్ కంప్లీట్ అయింది. ఈ సినిమాకు యు ఎ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సెన్సార్ పూర్తయిన సందర్భంగా ప్రెస్ నోట్ విడుదల చేశాడు కల్యాణ్ రామ్. సినిమా బాగా వచ్చిందని ప్రకటించాడు. కానీ మరో రెండో రోజుల్లో.. అంటే ఈనెల 22కు షేర్ సినిమా విడుదల అవుతుందా […]

షేర్ దసరాకి రావట్లేదా..?
X
తను నటించిన షేర్ సినిమాను దసరాకు విడుదల చేస్తున్నట్టు కల్యాణ్ రామ్ గతంలో ప్రకటించాడు. కానీ ఇప్పుడు మాత్రం తేదీని అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా షేర్ సినిమా సెన్సార్ కంప్లీట్ అయింది. ఈ సినిమాకు యు ఎ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సెన్సార్ పూర్తయిన సందర్భంగా ప్రెస్ నోట్ విడుదల చేశాడు కల్యాణ్ రామ్. సినిమా బాగా వచ్చిందని ప్రకటించాడు. కానీ మరో రెండో రోజుల్లో.. అంటే ఈనెల 22కు షేర్ సినిమా విడుదల అవుతుందా లేదా అనే విషయాన్ని మాత్రం పక్కా చేయలేదు. ఓవైపు బిజినెస్ బాగా జరుగుతోందని చెబుతూనే.. మరోవైపు విడుదల తేదీని ఎనౌన్స్ చేయకపోవడంతో షేర్ ఆగమనంపై అందర్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరుణ్ తేజ నటించిన కంచె సినిమా కోసం షేర్ ను పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో కల్యాణ్ రామ్ ఉన్నట్టు తెలుస్తోంది. షేర్ సినిమా విడుదల అవుతుందా లేక వాయిదా పడుతుందా అనే విషయం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
First Published:  19 Oct 2015 7:04 PM GMT
Next Story