Telugu Global
Cinema & Entertainment

కల్యాణ్ రామ్ బ్యానర్ లో తారకరాముడు

డిఫరెంట్ కాంబినేషన్లు సెట్ చేయడంలో దిట్ట అనిపించుకున్నాడు కల్యాణ్ రామ్. ఇప్పటికే రవితేజతో కలిసి కిక్-2 సినిమాను తీశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అది వేరే సంగతి. కానీ అప్పట్లో కల్యాణ్ రామ్ – రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ అనగానే ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు అలాంటిదే మరో కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు కల్యాణ్ రామ్. తన సోదరుడు ఎన్టీఆర్ తో ఓ మెగా మూవీ […]

కల్యాణ్ రామ్ బ్యానర్ లో తారకరాముడు
X
డిఫరెంట్ కాంబినేషన్లు సెట్ చేయడంలో దిట్ట అనిపించుకున్నాడు కల్యాణ్ రామ్. ఇప్పటికే రవితేజతో కలిసి కిక్-2 సినిమాను తీశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అది వేరే సంగతి. కానీ అప్పట్లో కల్యాణ్ రామ్ – రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ అనగానే ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు అలాంటిదే మరో కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు కల్యాణ్ రామ్. తన సోదరుడు ఎన్టీఆర్ తో ఓ మెగా మూవీ ప్లాన్ చేస్తున్నాడు. అవును.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తారక్ హీరోగా నటిస్తూ.. కల్యాణ్ రామ్ నిర్మించే సినిమా ప్రస్తుతం చర్చల్లో ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్ పై మరో సినిమా చేస్తాడు. ఈ రెండు సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత మాత్రమే కల్యాణ్ రామ్ బ్యానర్ లో నటించే సినిమాపై క్లారిటీ వస్తుంది.
Next Story