Telugu Global
Cinema & Entertainment

మా అన్న స్టిల్ బ్యాచిల‌ర్‌!

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కు 49 ఏళ్ల వ‌య‌సులోనైనా పెళ్లి జ‌రుగుతుంద‌ని సంతోష‌ప‌డిన అభిమానుల ఆశ‌ల‌పై నీళ్లుచ‌ల్లింది అత‌ని ముద్దుల చెల్లి అర్పితాఖాన్. మా అన్నకు ఎవ‌రితోనూ నిశ్చితార్థం జ‌ర‌గ‌లేదు.. ఆయ‌న స్టిల్ బ్యాచిల‌రే.. అని ట్వీట్ చేసి మ‌రీ చెప్పింది. రెండు మూడు రోజుల నుంచి రొమేనియ‌న్ టీవీ న‌టి లులియాకు స‌ల్మాన్ ఖాన్‌కు నిశ్చితార్థం జ‌రిగింద‌ని వ‌స్తున్న వార్త‌లు అన్నీ వ‌దంతుల‌ని కొట్టి పారేసింది. మా అన్న వివాహం విష‌యంలో వివిధ వెబ్‌సైట్లలో, పత్రికల్లో […]

మా అన్న స్టిల్ బ్యాచిల‌ర్‌!
X
బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కు 49 ఏళ్ల వ‌య‌సులోనైనా పెళ్లి జ‌రుగుతుంద‌ని సంతోష‌ప‌డిన అభిమానుల ఆశ‌ల‌పై నీళ్లుచ‌ల్లింది అత‌ని ముద్దుల చెల్లి అర్పితాఖాన్. మా అన్నకు ఎవ‌రితోనూ నిశ్చితార్థం జ‌ర‌గ‌లేదు.. ఆయ‌న స్టిల్ బ్యాచిల‌రే.. అని ట్వీట్ చేసి మ‌రీ చెప్పింది. రెండు మూడు రోజుల నుంచి రొమేనియ‌న్ టీవీ న‌టి లులియాకు స‌ల్మాన్ ఖాన్‌కు నిశ్చితార్థం జ‌రిగింద‌ని వ‌స్తున్న వార్త‌లు అన్నీ వ‌దంతుల‌ని కొట్టి పారేసింది. మా అన్న వివాహం విష‌యంలో వివిధ వెబ్‌సైట్లలో, పత్రికల్లో వచ్చే వార్తలన్నీ నమ్మవద్దని విజ్ఞ‌ప్తి చేసింది. పాపం కండ‌ల వీరుడికి 50 ఏళ్లు వ‌చ్చేదాకా పెళ్లియోగం రాసిపెట్టులేదేమో అని ఆయ‌న అభిమానులు ఉసూరుమంటున్నారు.
Next Story